EPFO Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
Last date for submission of Life Certificate for pensioners: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తాము జీవించి ఉన్నట్లు చందాదారులు సర్టిఫికెట్‌ను సమర్పిస్తేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతీ నెలా ఈపీఎఫ్ఓ పింఛన్‌ను మంజూరు చేస్తుంది. అయితే కరోనావైరస్ నేపథ్యంలో అంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును నవంబరు 1 నుంచి 2020 డిసెంబరు 31 వరకు గడువును పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి గడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ గడువును పెంచుతూ.. సెంట్రల్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ (Ministry Of Personnel, Public Grievances & Pensions) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వయసు మీద పడిన ఫించన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లడం చాలా కష్టంగా మారింది. దీంతో పింఛన్‌దారులు గడువును మరికొంతకాలం పెంచాలంటూ పెన్షన్ మంత్రిత్వ శాఖకు వినితి పత్రాలను పంపించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాక కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫిస్‌లో సంప్రదించిన అనంతరం గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెన్షన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి వరకు పింఛన్‌దారులకు యథావిధిగా పింఛన్ అందనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe