Legendary singer Lata Mangeshkar passes away at 92: లెజండరీ సింగర్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92)‌ (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ (Covid-19) స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. దీంతో ఆమె నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1942లో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభించారు. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న ఆమె..  దాదాపు 30 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు.  అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. 


భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు పలు పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం. 1969లో పద్మ భూషణ్‌,  1999లో పద్మ విభూషణ్‌, 2001లో భారతరత్న పురస్కారాలను అందుకున్నారు లతా మంగేష్కర్. 1989లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్‌ ప్రభుత్వం '‘ది లీజియన్‌ ఆఫ్ హానర్‌' పురస్కారం కూడా పొందారు.


Also Read: Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత


ప్రముఖుల సంతాపం:


>> లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్​కు  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ సంతాపం ప్రకటించారు. లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హృదయాలను కలిచివేసిందన్నారు. ఆమె లాంటి కళాకారులు శతాబ్దంలో ఒక్కరు జన్మిస్తారు. లతా జీ సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. - రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి 




>> గాన కోకిల​ లతా మంగేష్కర్​ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆమెతో జరిపిన సంభాషణలు మరువలేనివి. లతాజీ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి


 >> లతాజీ మరణంతో భారత్‌ తన స్వరాన్ని కోల్పోయినట్లైంది. ఆమె మరణం పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చింది. - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి


>> లతా దీదీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలు మరువలేనివి. ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. - అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి  


>> గాయని లతా మంగేష్కర్​కు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ సంతాపం ప్రకటించారు. ఎన్నో తరాల పాటు ఆమె పాటలు గుర్తుండిపోతాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు గడ్కరీ చెప్పారు.- నితిన్​ గడ్కరీ, కేంద్రమంత్రి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి