న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఉద్దేశించిన లాక్‌డౌన్ ఫలప్రదమైందని, చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడం సత్ఫలితాన్నిచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సహాయ కార్యదర్శి పేర్కొన్నారు. లాక్‌డౌన్ విధించిన తర్వాత గత రెండు వారాల్లో దేశంలో 15 రాష్ట్రాల్లో కనీసం 25 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని, ఇంతకు ముందు ఈ జిల్లాల్లో కరోనా కేసులు నమోదయినప్పటికీ తాజా కేసులేవీ లేవని అన్నారు. తద్వారా ప్రజల కదలికలపై విధించిన ఆంక్షలు గత 20 రోజుల్లో ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు తోడ్పడ్డాయి అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Read Also: అమెరికాలో మరో మర్కజ్.. కరోనా కేసుల పెరుగుదలకు ఆ ఔషధ కంపెనీయే కారణమా?


మరోవైపు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ బారినపడి అమెరికాలో గత 24 గంటల్లో 1,514 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. మిగతాదేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా మరణాలు ఎక్కువని, ఇప్పటివరకు మొత్తం 22,020 మంది దీని బారిన పడి మరణించారని పేర్కొంది.  అమెరికాలో ఇప్పటివరకు 5,55,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది కి పైగా కరోనాకు గురికాగా, 1,14,000 మంది మరణించారని తెలిపింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని, అయితే చైనాలో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోందని గత ఆరువారాల్లో కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయని చైనా కు చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..