Leap Year weekendలో భారతీయులు దర్శించే ప్రాంతాలివే!
ఫిబ్రవరి 29 వచ్చిందంటే చాలు.. ఈ లీపు సంవత్సరం వీకెండ్ ఎక్కడికి వెళదామా అని ప్లాన్ చేసుకునే వారికి కొదువ లేదు.
ఫిబ్రవరి 29. కొందరికి ప్రత్యేకం. కానీ ఆరోజు పుట్టినవారికి, వివాహం చేసుకోవడం, ఇతరత్రా ముఖ్యమైన కార్యక్రమాలు ఆరోజు ఉన్నవారు మరో నాలుగేళ్ల వరకు ఎదురుచూడక తప్పదు. అయితే లీప్ డే (Leap Day) రోజును ప్రత్యేకంగా జరపాలని, తమ జీవిత భాగస్వామితోగానీ, లేక స్నేహితులతో షికారుకు వెళ్లేవాళ్లు సైతం ఉంటారు. లీప్ ఇయర్ వీకెండ్ రోజు అంటే ఫిబ్రవరి 29న మన దేశస్థులు ఎక్కువగా సందర్శించే స్థలాలపై ఆసక్తికర వివరాలు వెలుగుచూశాయి.
Also Read: వామ్మో .. మార్చిలో బ్యాంకులకు అన్ని సెలవు దినాలా?
Also Read: పుట్టింది ఫిబ్రవరి 29న.. మరి బర్త్ డేల సంగతేంటి?
మనదేశ సందర్శకులు ఫిబ్రవరి 29న ఏయే ప్రాంతాలను దర్శిస్తున్నారో ట్రావెల్ బుకింగ్ వెబ్ సైట్ బుకింగ్.కామ్ కొన్ని వివరాలు వెల్లడించింది. జమ్మూకాశ్మీర్‌లోని కత్రా (వైష్ణోదేవి), రాజస్థాన్‌లోని అజ్మీర్, ఒడిశాలోని పూరి, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లను లీపు సంవత్సరం రోజున దర్శించుకుంటున్నారట.
Also Read: లీప్ ఇయర్ అంటే ఏమిటి. ఫిబ్రవరిలో 29 తేదీ ఎలా?
వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని హిల్ స్టేషన్ షిమ్లా, మహారాష్ట్రలోని కొండ ప్రాంతం లోనవాలాలు లీప్ ఇయర్ రోజు విజిట్ చేసే ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచాయి. భారతీయులు బీచ్‌లను సైతం తమ డెస్టినేషన్ ఏరియాగా ఎంచుకుంటున్నారు. గోవాలోని మార్జిమ్ (Morjim Beach)బీచ్, బాగా (Baga Beach) బీచ్‌లకు లీప్ ఇయర్ డే రోజు అత్యధిక పర్యాటకులు వెళ్తున్నారని బుకింగ్ వెబ్‌సైట్ గుర్తించింది.
See Pics: టాలీవుడ్ ఎంట్రీకి ముందే మోడల్ రచ్చ రచ్చ!
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్