Leopard jums gate and attacks Pet Dog in Madhya Pradesh: క్రూర మృగాల్లో ఒకటైన చిరుతపులి (Leopard) అడవిలో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా సంచరిస్తుంటుంది. తనకు దొరికిన జంతువులను, మనుషులను వెంటాడి, వేటాడి మరీ తినేస్తుంది. ఒక్కోసారి ఆహరం కోసం ఇళ్లలోకి కూడా చొరబడుతుంటుంది. అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఛతర్‌పూర్‌లో చోటుచేసుకుంది. మూసివేసి ఉన్న గేటును సైతం అమాంతంగా దూకి.. ఇంటిలో ఉన్న పెంపుడు కుక్క (Pet Dog)ను ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌ అనే జిల్లా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఛతర్‌పూర్‌ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. అడవి పక్కనే ఉండడంతో.. అపుడప్పుడు క్రూర మృగాలు గ్రామాల్లోకి చొరబడుతుంటాయి. అందుకే సింహం, చిరుతపులి లాంటి క్రూర మృగాలు ఇళ్లలోకి రాకుండా.. గ్రామస్తులు తమ ఇంటి చుట్టూ భారీ ప్రహరీ గోడ కట్టుకున్నారు. అంతేకాదు బరువైన గేట్లు కూడా పెట్టుకున్నారు. అయినా కూడా సింహం, చిరుతపులి, ఏనుగుల భారీ నుంచి వారికి రక్షణ లేకుండా పోయింది. 


Also Read: IND vs SA Dream11 Prediction: బరిలోకి రహానే.. తెలుగు ఆటగాడికి నిరాశే! దక్షిణాఫ్రికాతో బరిలోకి దిగే భారత జట్టిదే!!


తాజాగా ఛతర్‌పూర్‌లో చిరుతపులి (Leopard) ఓ ఇంటి పెద్ద గేటును సైతం అమాంతం దూకి రెప్పపాటులో పెంపుడు కుక్క (Pet Dog)ను ఎత్తుకెలింది. రాత్రిపూట చిరుతపులి రాకను గుర్తించిన అక్కడి వీధి కుక్కలు మొరగసాగాయి. ఇంటి గేటుకి లోపలున్న కుక్క కూడా చిరుతను గమనించి అరిచింది. కాసేపు గేటు వద్ద కాచుకుని చిరుతపులి.. ఒక్కసారిగా గేటు దూకి కుక్కను వెంటాడింది. కుక్కను నోట కరుచుకుని గోడ దూకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు ఆ ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తమ కుక్కను చిరుత ఎత్తుకెళ్లిందని యజమాని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 


యజమాని పోస్ట్ చేసిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఆ ఘటనపై స్పందించాడు. 'కొందరికి ఇది అసాధారణమైన దృశ్యం. కానీ కొండ ప్రాంతాలతో సహా అనేక ప్రాంతాలలో చిరుతపులులు కుక్కలను వేటాడతాయి. కాబట్టి స్థానిక ప్రజలు తమ పెంపుడు జంతువులను కాపాడుకునేందుకు ఇనుప గెట్‌లను అమర్చుతారు. ఇది ప్రజలకు కూడా రక్షణ ఇస్తుంది. అలాగే చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు చిరుతపులికి ఇబ్బందులను కలిగిస్తాయి' అని పర్వీన్ కస్వాన్ ట్వీట్ చేశారు. వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు పెంపుడు కుక్కల పట్ల యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


Also Read: Pushpa Dialogue Promos: బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు.. పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్!! (వీడియో)




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook