భారత జీవిత భీమా సంస్థ (LIC) నగదు సేవింగ్స్, పాలసీలతో పాటు మంచి పనులు సైతం చాలా చేస్తుంది. ప్రతి ఏడాది విద్యార్థులకు ఉపకార వేతనాలు సైతం అందిస్తోంది. పేద విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్ అందించనుంది. ప్రతి ఎల్‌ఐసీ డివిజన్ నుంచి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉన్నత విద్య కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతం 2020-21 సంవత్సరానికిగానూ ‘గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్-2020’ పేరుతో ఎల్ఐసీ (Life Insurance Corporation of India) ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులు పదో తరగతి ఇంటర్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 2019-20 విద్యా సంవత్సరానికిగానూ టెన్త్, లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇందుకు అర్హులు. 


Also Read: Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి



అయితే సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో చేరిన వారికీ ఈ సాయం అందనుంది. స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు 60 శాతం మార్కులు ఉండాలి. వార్షిక ఆధాయం లక్ష రూపాయలకు మించరాదు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర ఏదైనా డిప్లొమా కోర్సులు చదువుతున్న వారు సైతం ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపింది.


Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్



ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సూచించిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. డిసెంబర్ 31వ తేదీ వరకు స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులలో చేరిన విద్యార్థులు 55శాతం మార్కులు, డిగ్రీ, ఇతర గ్రాడ్యుయేషన్ విద్యార్థులు 50 శాతం తెచ్చుకుంటేనే తరువాతి సంవత్సరానికి ఎల్‌ఐసీ ఈ స్కాలర్‌షిప్ అందించనుంది.
Also Read : Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు



కాగా, ప్రతి ఎల్‌ఐసీ డివిజన్ నుంచి 20 మందికి స్కాలర్‌షిప్ అందనుంది. అందులో 10 మంది బాలురు, 10 మంది బాలికలును ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది రూ.20000 స్కాలర్‌షిప్ ఇస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి రూ.10,000 రెండేళ్లపాటు ప్రతి నెలా అందిస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ కానుంది.


Also Read : BRAOU Admissions 2020-21: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ గడువు పెంపు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook