కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2018: హోరాహోరిగా సాగుతున్న పోరు

Tue, 15 May 2018-8:30 pm,

కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2018 : హోరాహోరిగా సాగుతున్న పోరు

Latest Updates

  • జేడీఎస్, కాంగ్రెస్ కలిసి సంఖ్యాపరంగా బీజేపీ కంటే ఎక్కువ మెజారిటీని సంపాదించుకున్నాయి. మరి వారితో సరిసమానమైన మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది: ఎం వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ నేత

  • బీజేపీ సీఎం అభ్యర్థి ఎడ్యూరప్ప ఇప్పుడే గవర్నరుని కలిశారు. కర్ణాటకలో అతి పెద్ద రాజకీయ పార్టీగా మారినందుకు తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. గవర్నరు కూడా వారిని అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోమనడం గమనార్హం. ఎడ్యూరప్ప గవర్నరుని కలిసి వెళ్లాక.. జేడీఎస్ నేత కుమారస్వామి రాజ్ భవన్‌కు గవర్నరును కలవడానికి వచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య మొదలైనవారు కూడా రాజ్ భవన్‌కు వచ్చారు

  • జేడీఎస్ నేత కుమారస్వామి గవర్నరుకి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇచ్చిందని.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. అందుకు గాను మాట్లాడేందుకు అవకాశమివ్వాలని ఆయన లేఖలో తెలిపారు. ఈ క్రమంలో అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఆయన గవర్నరుకు లేఖ రాశారు. 

  • జేడీఎస్ తరఫున మేము ఎప్పుడూ కూడా కుమారస్వామి సీఎం అవ్వాలనే కోరుకుంటున్నాం. తాజా ఫలితాలు ఎలా ఉన్నా.. బీజేపీకి పట్టం కట్టకూడదన్నదే కర్ణాటక ప్రజల నిర్ణయం. కాంగ్రెస్  తమ మద్దతును మాకు ఇస్తామని తెలపింది. వారి ప్రతిపాదనను మేము అంగీకరిస్తాం. ఇరు పార్టీ నాయకులు ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నరు వద్దకు వెళ్లి కలిసి ఆఖరి నిర్ణయం తీసుకుంటారు - దానిష్ అలీ, జేడీఎస్ నేత

  • జేడీఎస్ మద్దతుతో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ రచన చేసింది. జేడీఎస్ నేత కుమారస్వామికి కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించింది. జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని సమాచారం. కుమారస్వామి ప్రభుత్వానికి బైటినుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సంసిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కోరనున్నాయి. జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిద్దరామయ్య అన్నారు.'ప్రజా తీర్పును స్వాగతిస్తాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాకు తగిన సంఖ్యా బలం లేదు కాబట్టి జేడీఎస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్దమే' అని కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర తెలిపారు.జేడీఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి ఈరోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.కాగా, సీఎం సిద్ధరామయ్య సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.

  • కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నేతలు ఈ రోజు సాయంత్రం గవర్నరుని కలవడానికి వెళ్తున్నారు: కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేత

     

  • కర్ణాటక ఎన్నికల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. ఒకవేళ బీజేపీ మెజారిటీ మార్కు దాటలేకపోతే జేడీఎస్‌తో కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పోస్టు ఇచ్చైనా సరే.. బీజేపీని గెలవకుండా చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉన్నట్లు కనబడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తాము జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమే అని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ 106 సీట్లతో ముందంజలో ఉండగా..  కాంగ్రెస్ 73 సీట్లలో..జేడీఎస్ 41 సీట్లలో ముందంజలో ఉంది. ఎలాగైనా కాంగ్రెస్ గెలవాలని భావిస్తుంది కాబట్టి.. జేడీఎస్ పార్టీతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడానికైనా వెనుకాడడం లేదని.. ఆఖరికి కుమారస్వామికి సీఎం పదవి ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేయడం లేదని సమాచారం. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య ఇప్పటికే బాదామిలో గెలిచి చాముండేశ్వరిలో ఓడిపోయారు. 

  • బెంగళూరు బీటీఎం లేఅవుట్‌లో రామలింగారెడ్డి (కాంగ్రెస్) విజయాన్ని సాధించారు. అలాగే గాంధీనగర్‌లో దినేష్ గుండూరావు (కాంగ్రెస్) విజయం సాధించారు. శివాజీనగరులో రోషన్ బేగ్ (కాంగ్రెస్) గెలుపొందగా.. మంగళూరులో యు.టి.అబ్దుల్‌ ఖాదర్‌(కాంగ్రెస్‌) విజయం సాధించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కడపటి వార్తలు అందేసరికి, చిక్‌మగళూరులో సి.టి.రవి, మొళకాల్మూర్‌లో శ్రీరాములు, శివమొగ్గలో ఈశ్వరప్ప, శిగ్గావిలో బస్వరాజ్‌ బొమ్మాయి, కంప్లిలో సురేశ్‌బాబు, సిరుగుప్పలో సోమలింగప్ప , హుబ్లీ-ధార్వాడ్‌ సెంట్రల్‌లో జగదీశ్‌ శెట్టర్‌, సొరబలో కుమార్‌ బంగారప్ప గెలుపొందారు. జేడీఎస్ తరఫున రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి గెలుపొందారు. పాత మైసూరులో జేడీఎస్ తన ప్రాబల్యాన్ని చాటుతోంది

  • కర్ణాటక ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా వెళ్లే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తున్నట్లు కనిపించకపోవడమే అందుకు కారణం. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 112 సీట్లు పొందాల్సిన తరుణంలో.. బీజేపీ దాదాపు 105 సీట్లే కైవసం చేసుకొనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ 58 స్థానాల్లో గెలుపొంది.. 47 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ మాత్రం 23 స్థానాల్లో గెలుపొంది 52 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్‌ 11 స్థానాల్లో గెలుపొంది.. 28 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్లు కనిపించడం లేదు. కాబట్టి జేడీఎస్ ఎవరి వైపుకి మొగ్గుతుందో ఆ పార్టీయే పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. 

  • బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ ఎడ్యూరప్ప శిఖారిపురి నియోజకవర్గం నుండి 35,397 ఓట్లతేడాతో గెలిచారు. 

  • ఇప్పుడు గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ మా గెలుపుని ఖండిస్తుంది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మేము తప్పకుండా గెలవడం ఖాయం: నితిన్ గడ్కరి, కేంద్రమంత్రి

  • కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు. మోదీగారి కష్టంతో అమిత్ షా లాంటి వారు పార్టీ కోసం బాగా శ్రమించారు. పార్టీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కూడా బాగా సహకరించారు. ఇక కర్ణాటకలో బీజేపీ హవా కొనసాగాల్సిందే - రామ్ యాదవ్, బీజేపీ నేత

     

  • ఈ విజయం మోదీ నాయకత్వానికే దక్కుతుంది. మా కష్టంలో కర్ణాటక ప్రజలు నమ్మకాన్ని చూశారు. అందుకే నమ్మి ఓట్లు వేశారు - రవిశంకర్ ప్రసాద్, కేంద్రమంత్రి

  • రాహుల్ గాంధీ తన ప్రయత్నం తాను చేశాడు. కానీ ఈ ఓటమికి మేమే కారణం. మేము స్థానిక నాయకత్వాన్ని బాగా ఉపయోగించుకుంటే బాగుండేది. అలా చేయలేదు కాబట్టే ఓడిపోయాం- డీకే శివ కుమార్, కర్ణాటక మంత్రి

  • కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ ఇప్పటికే 10 స్థానాల్లో విజయం సాధించగా... 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప షికారపుర నుంచి విజయం సాధించగా.. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాదామిలో భాజపా అభ్యర్థి శ్రీరాములుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కానీ అదే సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో 17వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే వార్తలు రాగానే.. కేంద్ర మంత్రులు, రవిశంకర్ ప్రసాద్ మరియు నిర్మాలా సీతారామన్ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాల్లో మునిగితేలారు.

  • కర్ణాటక ప్రజలకు మంచి ప్రభుత్వం కావాలి, అందుకే ఈ సారి బీజేపీకి పట్టం కట్టారు - ప్రకాష్ జవదేకర్

  • "ప్రజలు సిద్ధరామయ్యని ఈ సారి నమ్మలేదు. తన అహంకారం వల్లే తాను ఓడిపోయే పరిస్థితి వచ్చింది" అని చాముండేశ్వరిలో సిద్ధరామయ్యతో పోటీపడుతున్న జేడీఎస్ అభ్యర్థి జీ టీ దేవెగౌడ అన్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధరామయ్య కన్నా 17000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.ఇదే క్రమంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎడ్యూరప్పని సీఎంగా మే 18వ తేదిన చూస్తానని తెలిపారు.ప్రస్తుత వార్తలు అందేసరికి, బీజేపీ 116 సీట్లలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 62 సీట్లలో ముందంజలో ఉంది. 

  • ఎవరు గెలిచినా.. అసలైన విజేత జేడీఎస్ మాత్రమే - హెచ్ డీ దేవెగౌడ, మాజీ ప్రధాని

  • పొత్తులతో మాకు పనేముంది. మేం ప్రభుత్వం నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం - సదానంద గౌడ, బీజేపీ నేత

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 214 నియోజకవర్గాలలో తొలి ఆధిక్యతలు అందుబాటులోకి రాగా వాటిలో 107 నియోజకవర్గాలలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. 63 చోట్ల కాంగ్రెస్ , 42 చోట్ల జేడీఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో రామనగర్, చన్నపట్న నుంచి పోటీలో ఉన్న జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఆధిక్యంలో ఉన్నారు.

    కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కనకపురలో తమ సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి నారాయణ గౌడ కంటే ఆధిక్యంలో ఉన్నారు.

    శికరిపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్థి కంటే 3420 ఓట్ల భారీ ఆధిక్యత కనబరుస్తున్నారు.

     

     

     

    కర్ణాటక సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి సిద్దరామయ్య పోటీ చేసిన రెండు స్థానాలలో ఒకచోట ఆధిక్యంలో ఉన్నారు. బదామిలో సిద్దూ ఆధిక్యంలో ఉన్నారు. చాముండేశ్వరి స్థానంలో వెనకంజలో ఉన్నారు. కాగా ఫలితాల సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి.

     

    వరుణలో సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి యతీంద్ర ఆధిక్యంలో ఉన్నారు.

     

     

     

     

    చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర ఓట్ల లెక్కింపు ఆరంభం కాగానే తన ఓటమిని అంగీకరించారు. తాను ఓడిపోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్, జేడీఎస్ కుమ్మక్కై తనను ఓడిస్తున్నారని యోగీశ్వర అన్నారు.

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉండగా 222 నియోజకవర్గాలను ఈ నెల 12 ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలో 40 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో గంటలో ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

     

     

     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం  దేశమంతా ఉత్కంఠగా  ఎదురుచూస్తోంది. నేడు వెల్లడి కానున్నాయి. ఎన్నికల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. కర్ణాటకలో మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు ఉండగా 3.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

    కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో 11 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56వేల మంది బలగాలను మోహరింపజేశారు. రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరుకు 11వేల మంది పోలీసులను తరలించారు. ఈ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.

     

    కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల భవితవ్యం ఈవీఎంలలో ఓట్ల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు కూడా కర్ణాటకలో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీలు తమతమ విజయంపై ధీమాతో ఉంటే.. హంగ్‌ వస్తే చక్రం తిప్పేందుకు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ వ్యూహాలు రచిస్తున్నారు.

     

    ఈ ఫలితాలు దేశ భవిష్యత్‌ రాజకీయాలను నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్నాటకలో విజయం సాధించే పార్టీకి 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. బాబా రాందేవ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

  • కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా పడింది. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 35928.35గా నమోదైంది

  • ఇది బీజేపీకి చారిత్రాత్మ విజయం అని భావిస్తున్నాం. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు - రమణ్ సింగ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి

  • బెంగళూరులో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం ప్రారంభించాయి. 

  • సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరిలో 12,000 ఓట్లతో ట్రైలింగ్‌లో ఉన్నారు. జేడీఎస్ నేత దేవగౌడ ముందంజలో ఉన్నారు. బాదామిలో సిద్ధరామయ్య 160 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 

  • 101 సీట్లలో బీజేపీ ఆధిక్యం. కాంగ్రెస్ 46 సీట్లలో ఆధిక్యం కనబరచగా.. జేడీఎస్ 38 సీట్లలో.. ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link