లైవ్ అప్‌డేట్స్: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తిలైవ్ అప్‌డేట్స్: వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5:05 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి గౌరవార్థం వారం రోజులు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకూ సమాచారం పంపారు. . ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి ప్రముఖులతో పాటు అభిమానులు, కార్యకర్తల తాకిడి పెరిగింది. తమ అభిమాన నేతకు నివాళులు అర్పించేందుకు ఉదయం నుంచే పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు క్యూ కట్టారు. అటు వాజ్‌పేయి పార్థివదేహాన్ని తరలించడానికి ఆర్మీ వాహనాలు సిద్ధంగా చేయగా.. ఉదయం 9 గంటలకు పార్థివ దేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు.
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మధ్యాహ్నం 1 గంట వరకూ నేతలు, అభిమానులు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. యమునా నది ఒడ్డున సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేడు ఢిల్లిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Latest Updates
రాష్ట్రీయ్ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాల మధ్య మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తి
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న అఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, శ్రీలంక తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి లక్ష్మణ్ కిరియెల్లా
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి చివరిసారిగా నివాళి అర్పిస్తున్న బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహంపై తొలగించిన జాతీయ జెండాను వాజ్‌పేయి మనవరాలికి అప్పగిస్తున్న భద్రతా దళాలు
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు ఢిల్లీకి వచ్చిన పాకిస్తాన్ న్యాయ శాఖ మంత్రి అలీ జఫర్
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నాంగేల్ వాంగ్‌చుక్
స్మృతి స్థల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి చివరిసారిగా ఘన నివాళి అర్పిస్తున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భద్రతాదళాలు
రాష్ట్రీయ్ స్మృతి స్థల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ వీడ్కోలు పలుకుతూ ఘన నివాళి అర్పిస్తున్న రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్
రాష్ట్రీయ్ స్మృతి స్థల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ వీడ్కోలుగా నివాళి అర్పిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవి చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ, ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా
రాష్ట్రీయ్ స్మృతి స్థల్ చేరుకున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర
స్మృతి స్థల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ వీడ్కోలుగా నివాళి అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
రాష్ట్రీయ్ స్మృతి స్థల్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ:
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమ సంస్కారాల్లో పాల్గొని ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు రాష్ట్రీయ్ స్మృతి స్థల్ చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
జన నేతకు వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్న జనం.
వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్న యావత్ కేంద్ర కేబినెట్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన వాజ్‌పేయి అంతిమయాత్ర.
సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ్ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాజ్‌పేయి అంత్యక్రియలు.
బీజేపీ ప్రధాన కార్యాలయం గేట్లు మూసివేత:
బీజేపీ కార్యాలయం ఆవరణలో ఉన్న వారికి మాత్రమే నివాళి అర్పించేందుకు అనుమతి Click here for full story
అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర: నిఘా నీడలో స్మృతి స్థల్ పరిసరాలు :
స్మృతి స్థల్‌తోపాటు అక్కడకు దారితీసే రహదారులన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ). Read full story here..
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాజ్ పేయి పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, యూపీ సీఎం యోగి, డీఎంకే నేత రాజా, అస్సామ్ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్
మాజీ ప్రధాని వాజ్‌పేయి పార్థివ దేహం బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. వాజ్‌పేయి నివాసం కృష్ణమీనన్ పార్కునుంచి దీన్‌దయాళ్ మార్గ్‌లోని బిజెపి కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివ దేహం చేరింది. మధ్యాహ్నం 1 గంట వరకూ వాజ్‌పేయికు నివాళులర్పించడానికి సందర్శకులను అనుమతిస్తారు. ఒంటి గంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
వాజ్‌పేయి నివాసం వద్ద నుండి పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బయల్దేరింది.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. వాజ్‌పేయి నివాసం నుండి కొద్దిసేపటి క్రితమే పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బయల్దేరింది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, గులామ్ నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర ముఖ్యమంత్రి బీప్లబ్ కుమార్ దేవ్, డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి, కేరళ గవర్నర్ పి.సదాశివం, తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, చీఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ సునీల్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, సినీప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీ నివాళులర్పించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నివాళులర్పించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి నివాళులర్పించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావంలో వాజ్‌పేయి సహాయం వెలకట్టలేనిదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. వాజ్‌పేయి మృతిపట్ల షేక్ హసీనా సంతాపం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలకు కూడా ఇది చాలా బాధాకరమైన రోజని పేర్కొన్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ నివాళులర్పించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్ధివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి నివాళులర్పించిన త్రివిధదళాలు