Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే! వాటి గురించి మరిన్ని విషయాలు..
Weather Updates LIVE: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం-దక్షిణ ఒడిస్సా తీరంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఒడిశా సహా మరో 6 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. గుజరాత్, మహారాష్ట్రల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబయి, రాయ్‌గఢ్, రత్నగిరి, పూణే జిల్లాలతో పాటు వచ్చే మూడు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
ఇక కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక మన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే జులై 24వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. "రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం సెలవులు ఉంటాయి.." అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Latest Updates
ప్లాష్.. ప్లాష్....
నిజామాబాద్ జిల్లాశ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ప్రాజెక్టు పూర్తిస్థాయి
FRL 1091 ft/332.53 M/90.3 TMC కాగా
ప్రస్తుతం 1,38,512 క్యూసెక్కులుగా నమోదు...
ప్రస్తుత నీటిమట్టం 1072.2అడుగులకు
45.2 టీఎంసీలుగా ఉంది
జిల్లా పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశాలు
వరద ప్రాభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు.
జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్.హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు
వర్షాలతో జంట జలాశయాలకు జలకళ
క్రమంగా జంట జలాశయాల్లోకి చేరుతున్న వరద నీరు
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లు అడుగు మేర ఎత్తిన అధికారులు
మూసీ నదిలోకి 700 క్యూసెక్కుల వరద నీరు విడుదల
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండీ దానకిశోర్ సూచనహైదరాబాద్:
హిమాయత్ సాగర్ కు పెరిగిన వరద నీరు
హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 2 గేట్లను ఓపెన్ చేయనున్న అధికారులు
నాలుగు గంటలకు 700 క్యూసెక్కుల ఔట్ ఫ్లో విడుదల
మూసీ నది ఆనుకొని ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సరూర్ నగర్:
1) అకాల వర్షానికి సరూర్ నగర్ చెరువులో వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో చెరువు గేట్లు ఎత్తివేసిన అధికారులు.2) చెరువు గేట్లు ఎత్తివేయడంతో కింది వైపు ఉన్న కాలనీలలోని ఉన్న డ్రైనేజీ లో చెత్త ఇరుక్కోవడంతో పొంగుతున్న డ్రైనేజీలు.
3) సరూర్ నగర్ చెరువు గేట్లు ఎత్తివేత పై స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు.
4) కనీసం ఏ సమాచారం లేకుండా గేట్లు ఎత్తడం పై స్థానిక ప్రజలు ముంపుకు మరియు ఆందోళనకు గురవుతున్నారు.
మల్కాజ్గిరి: మల్కాజిగిరి పరిధిలోని మౌలాలి గ్రీన్ హిల్స్ కాలనీ వద్ద ఉన్న ఒక పెద్ద వృక్షం కూలి రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది ప్రయాణికుడికి స్వల్ప గాయాలు. హుతాహుటిన స్పందించిన మల్కాజిగిరి ట్రాఫిక్. DRF. GHMC. సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సర్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని మల్కాజిగిరి ట్రాఫిక్ సిఐ శివ శంకర్ తెలిపారు .
రంగారెడ్డి..
రాజేంద్రనగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లోకి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రెండు రోజులుగా జలాశయాల్లోకి వరద ప్రారంభమైంది. ఈ సందర్భంగా హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి 400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో, చెరువు నీటిమట్టం స్థాయి 1764 ఫీట్లు కాగా 1762 ఫీట్స్ అడుగులు నీరు చేరింది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ, ఏసీపీ గంగాధర్, జలమండలి జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మేయర్ మహేందర్ గౌడ్ సిబ్బందితో కలిసి జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటున్నారుభారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సెలవులు
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సిఎం కేసీఆర్ తెలిపారు.
అదే సమయంలో భారీ వర్షాల మధ్య జనం భద్రత దృష్ట్యా ప్రైవేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు సైతం పలు అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ పోలీసు విభాగానికి చెందిన ఎస్‌ఐ గడ్డం మల్లేష్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు. ఆ ఫుల్ డీటేల్స్ ఇక్కడ మీ కోసం
SI Gaddam Mallesh: భారీ వర్షాలు పడే సమయంలో పిల్లలు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని అధికారులు హైదరాబాద్ వాసులను కోరుతున్నారు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బిఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా
కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వారం పాటు వాయిదా వేయాలని బిఅర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఒక ప్రకటన విడుదల చేశారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరికీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు
భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సంతోష్ నగర్.కాంచన్ బాగ్.పిసల్ బండా ప్రధాన రహదారుల జలమయమయ్యాయి
రహదారుల పై వరద కారణంగా ట్రాఫిక్ జామ్ లతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు....
మ్యాన్ హోళ్ళు పొంగి పొర్లుతున్నాయి...భారీ వర్షానికి కొట్టుకుపోయిన బొయితెలి వాగుపై వేసిన తాత్కాలిక వంతెన
రాజన్న సిరిసిల్ల జిల్లా ::
సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లోని పలు ఇళ్ళలోకి చేరిన వర్షం నీరు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక మహిళలు, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ ప్రాంతం నీట మునిగిందని ఆరోపణ.
తాము ఈ ప్రాంతంలో ఉండలేం, మా ఇళ్ళు తీసుకోండంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు
చింతూరు ఏజెన్సీ ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన..
గోదావరి శబరి నదులకు వరద నీరు పోటెత్తడంతో అధికారులను అప్రమత్తం చేస్తున్న కలెక్టర్
చింతూరు వి ఆర్ పురం కూనవరం మండలాలలోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు.
ప్రభుత్వం సూచించిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.