ZEE News Exit Polls 2024: ఢిల్లీ కోటలో జెండా పాతేదెవరు..? జీ న్యూస్ సర్వేలో సంచలన విషయాలు..!

Sun, 02 Jun 2024-9:44 pm,

ZEE News Exit Poll Results: కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందా..? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి సత్తా చాటుతుందా..? జీ న్యూస్ సర్వే రిపోర్ట్‌లో ఏం తేలింది..? జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ZEE News Exit Polls Updates: ఎంతో ఉత్కంఠ రేపుతున్న జీ న్యూస్‌ సర్వే రిపోర్ట్‌ వచ్చేసింది. బీజేపీ నినాదం చార్‌సౌ సీట్లు అందుకునే ఛాన్స్‌ లేదని సర్వే తేల్చింది. అంతేకాకుండా 2019లో గెలిచిన స్థానాలకంటే భారీగా సీట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా.. యూపీఏకి 91 సీట్లు, ఇతరులు 99 స్థానాలను దక్కించుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు భారీగా పుంజుకుంటున్నట్లు సర్వేలు తేలుస్తున్నాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సరళిపై జీ న్యూస్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఏఐతో సర్వే నిర్వహించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రోడికరించిన సమాచారంతో సర్వే నిర్వహించింది. ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి..? ఇండి కూటమి పుంజుకుంటుందా..? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభావం ఎంత..? జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Updates

  • ZEE News Exit Polls: రాజస్థాన్‌లో NDAకి 15-19 సీట్లు, ఇండియా కూటమికి 6-10 సీట్లు రావచ్చని అంచనా వేసింది. తమిళనాడులో ఎన్డీఏ కూటమికి 10 నుంచి 12, ఇండియా కూటమికి 21 నుంచి 27, ఇతరులు మూడు నుంచి ఐదు సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది.

  • ZEE News Exit Polls: జీ న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో NDA 20-24 సీట్లు, TMC 16-22 సీట్లు పొందే అవకాశం ఉంది. ఇండి కూటమికి 0-1 సీట్లు రావచ్చు.

  • ZEE News Exit Polls: కేరళలో కాంగ్రెస్‌ కూటమికి 10 నుంచి 12 సీట్లు, ఎన్డీఏకి ఐదు నుంచి ఏడు సీట్లు, ఇతరులు రెండు నుంచి ఐదు సీట్లు గెలుచుకుంటారని తేలింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమికి 08-12, ఎన్డీఏ కూటమికి 16 నుంచ 22 సీట్లు, మహారాష్ట్రలో ఇండి కూటమికి 26-34 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
     

  • ZEE News Exit Polls: హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్డీఏ 2-3, ఇండి కూటమికి ఒకటి నుంచి మూడు సీట్లు, జమ్మూ కశ్మీర్‌లో ఎన్డీఏకు ఒక సీటు, కాంగ్రెస్‌కు 2 నుంచి 4 సీట్లు, బీజేపీకి 0-1, ఇతరులు 0-1, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి రెండు నుంచి నాలుగు సీట్లు, బీజేపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
     

  • ZEE News Exit Polls: గుజరాత్‌లో ఎన్డీఏకి 20 నుంచి 26 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్‌కు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయని జీ న్యూస్ సర్వేలో తేలింది. హర్యానాలో ఇండి కూటమికి ఐదు నుంచి ఏడు సీట్లు, ఎన్డీఏ కూటమికి రెండు నుంచి మూడు సీట్లు వస్తాయని వెల్లడించింది.

  • ZEE News Exit Polls: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 06 నుంచి 08 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో బీజేపీకి కూటమికి రెండు నుంచి నాలుగు సీట్లు, కాంగ్రెస్ కూటమికి మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని పేర్కొంది.

  • ZEE News Exit Polls: అస్సాంలో ఎన్డీఏ 08-12, ఇండి కూటమి 01-03, ఇతరులు 01-03, బీహార్‌లో ఎన్డీఏ 15-25, ఇండి కూటమి 15-25 సీట్లు గెలుచుకుంటాయని తేల్చింది.

  • ZEE News Exit Polls: కర్ణాటకలో కాంగ్రెస్‌కు 12 నుంచి 20 సీట్లు వస్తాయని.. బీజేపీ 10 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

  • ZEE News Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని జీ న్యూస్ ఏఐ సర్వేలో తేలింది. కాంగ్రెస్ 10-14, బీజేపీ 04-06 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

  • ZEE News Exit Polls: ఎన్డీఏ కూటమికి ఈసారి 305 నుంచి 315 వరకు మాత్రమే పరిమితమవుతుందని జీ న్యూస్‌ సర్వే అంచనాకు వచ్చింది. అలాగే ఎన్డీఏ కూటమి 180 నుంచి 195 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలవనుంది. ఇక ఇతరులు 38 నుంచి 52 స్థానాలు గెలుచుకోనున్నారు. వీరిలో వైసీపీ, బీఆర్ఎస్, టీఎంసీ పార్టీలు ఉన్నాయి. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link