Lockdown 5.0 : లాక్‌డౌన్ 5.0లో అనుమతించేవి.. అనుమతించనివి
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ( Lockdown extension ) కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) నివారించాలంటే కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) కచ్చితంగా, కఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0 ( Lockdown5.0 ) అమలులో ఉండనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ( Lockdown extension ) కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) నివారించాలంటే కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) కచ్చితంగా, కఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0 ( Lockdown 5.0 ) అమలులో ఉండనున్నట్టు కేంద్రం ప్రకటించింది. లాక్‌డౌన్‌ని మరోసారి పొడిగించిన నేపథ్యంలో కరోనా ప్రభావం లేని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో పలు సడలింపులకు అనుమతిస్తూ కేంద్రం తాజాగా లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలు ( Lockdown 5.0 guidelines ) విడుదల చేసింది. ఈసారి లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకే వర్తిస్తుందని కేంద్రం తమ ప్రకటనలో పేర్కొంది. జూన్ 8 నుంచి సడలింపులు అమల్లోకి రానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, ఇతర ప్రార్ధనా స్థలాలు తెరుచుకోనున్నాయి. ఐతే, అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి లాక్‌డౌన్ నిబంధనలు యధావిధిగా వర్తిస్తాయి. ( Lockdown 5.0 : జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. కొత్త మార్గదర్శకాలు, కొత్త సడలింపులు )
కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ నెలలో రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలించిన అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తర్వాతే స్కూల్స్, కాలేజీలు వంటి విద్యా సంస్థలకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలుస్తోంది.
జూన్ 8 నుంచి కేంద్రం అనుమతించిన కార్యకలాపాలు, సేవల జాబితా:
హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆతిథ్య రంగం సేవలు పునఃప్రారంభం.
ప్రార్థనా మందిరాల్లో పునఃదర్శనం.
జూన్ 1 నుంచి రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటేందుకు కేంద్రం అనుమతించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుమతి నిరాకరించాలనుకుంటే.. ఆ విషయాన్ని దేశ ప్రజలు అందరికీ తెలిసేలా ముందస్తు ప్రకటన చేసి ఆ ప్రకటనకు విస్కృత స్థాయి ప్రచారం కల్పించాలి. అదే సమయంలో గూడ్స్ ట్రక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల సరిహద్దుల వద్ద నిలిపేయరాదని కేంద్రం స్పష్టంచేసింది.
అనుమతి లేనివి:
సినిమా హాళ్లు, మెట్రోరైళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు.
పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, క్లబ్బులు, జిమ్స్‌కి కూడా అనుమతి నిరాకరించిన కేంద్రం.
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం.
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..