న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ( COVID-19 ) వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే కేంద్రం మొగ్గుచూపింది ( Lockdown extension ). కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్‌ని ( Lockdown in containment zones ) కొనసాగిస్తున్నట్టుగా కేంద్రం స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ( Tamil movies: ఈ తమిళ చిత్రాల కథలే ఇప్పుడు నిజమవుతున్నాయా ? )
లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో కొత్తగా ఇచ్చిన సడలింపులకు ( Lockdown 5.0 exemtions ) సంబంధించి కేంద్రం విడుదల చేసిన లాక్డౌన్ 5.0 మార్గదర్శకాల ( Lockdown 5.0 guidelines ) ప్రకారం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఇదివరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండేది. జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. విద్యాసంస్థల పునఃప్రారంభంపై జులై నెలలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూన్ నెలలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో పరిశీలించిన తర్వాతే విద్యా సంస్థలతో పాటు రద్దీ ప్రదేశాల్లో కార్యకలాపాలపై కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..