Lockdown 5.0: రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందే... అమలు చేయాల్సిందే...
లాక్డౌన్ 4.0 ఆదివారం ముగియబోతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి 13 నగరాలకు కొత్త మార్గదర్శకాలను లాక్ డౌన్ 5.0 కఠినంగా అమలు చేయాలని సూచించింది. కాగా ఈ 13 నగరాల్లో (కోవిడ్ -19) కేసులు 70%
ఢిల్లీ: లాక్డౌన్ 4.0 ఆదివారం ముగియబోతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Ministry of Home affairs) మరోసారి 13 నగరాలకు కొత్త మార్గదర్శకాలను (Lockdown 5.0) లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సూచించింది. కాగా ఈ 13 నగరాల్లో (కోవిడ్ -19) కేసులు 70% వరకు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన రెండు సమావేశాలలో ఈ సూచనలు (guidelines) వచ్చాయని తెలిపారు.
Also Read: Heartfelt note: తాప్సీ ఇంట్లో విషాదం..
దేశంలోని 13 నగరాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు అమలు చేయాలని, ఆయా రాష్ట్రాలకు వారి అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అధికారాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం పట్టణ (metropolitan cities) స్థాయిల్లో కోవిడ్ -19 నిర్వహణపై మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే (containment zone buffer zone) కంటైన్మెంట్, బఫర్ జోన్‌లలో జరిగే తప్పనిసరి కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన పర్యవేక్షణ ద్వారా సోకిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ (Contact Tracing, టెస్టింగ్ ప్రోటోకాల్ (Testing Protocal) పాటించాలని సూచించింది.
దేశంలోని ఈ 13 ప్రధాన నగరాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 (Latest lockdown 5.0 guidelines) మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని సూచించింది.
• ముంబై
• చెన్నై
• ఢిల్లీ
• అహ్మదాబాద్
• థానే
• పూణే
• హైదరాబాద్
• కోల్‌కతా, హౌరా
• ఇండోర్
• జైపూర్
• జోధ్పూర్
• చెంగల్పట్టు
• తిరువల్లూరు
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..