న్యూ ఢిల్లీ: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తంచేస్తూ లాక్‌డౌన్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత కూడా కరోనావైరస్ కోవిడ్ హాట్‌స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగే (Lockdown in india) అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఎక్కడైతే కరోనావైరస్ ప్రభావం అధికంగా ఉందో... ఆయా ప్రాంతాలను కరోనావైరస్ హాట్‌స్పాట్స్‌గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ హాట్ స్పాట్స్ ప్రాంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆ వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం కోవిడ్ హాట్‌స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ డాక్టర్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : నిర్మాత కూతురికి కరోనా.. క్వారంటైన్‌లో కుటుంబం


లాక్ డౌన్ కొనసాగింపుపై డా గులేరియా స్పందిస్తూ.. మొదట దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందనే విషయంలో ప్రభుత్వం ఓ అంచనాకు రావాల్సి ఉంటుందని అన్నారు. అయితే.. ఏదేమైనా ఎక్కడైతే కరోనా వేగంగా విస్తరిస్తుందో అక్కడ లాక్ డౌన్ ముగించడం కష్టమే అవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అందుకే కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని ఆయన మరోసారి గుర్తుచేశారు. అంతేకాదు.. లాక్ డౌన్ ప్రభావం ఎలా ఉందనేది ఏప్రిల్ 14 తర్వాతే తెలుస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు.


Read also: ఏపీలో మరో 14 మందికి కరోనా.. ఓ జిల్లాలో 50కి పైగా కేసులు


కరోనాకు వ్యాక్సిన్:
కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులకు వ్యాధిని నయం చేసేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని.. ఆ వ్యాక్సిన్ ప్రయోగాలు తొలి దశలో ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..