Locust attack in UP: లక్నో: ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చిన మిడతల దండు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పంటలపై ఈ మిడతల దండు దాడులు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని పలుజిల్లాల్లో గత 24 గంటల నుంచి మిడుతల దండు (locust attack) భీభత్సం సృష్టిస్తోంది. ఎనిమిది జిల్లాల్లోని పంటలపై మిడతల దండు దాడి ప్రభావం అధికంగా ఉందని యూపీ వ్యవసాయ శాఖ (UP agriculture dept) తెలిపింది. ఈ మేరకు అధికంగా ప్రభావితమైన జిల్లాలతోపాటు మరో ఎనిమిది జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారుల బృందాలను అప్రమత్తం చేసి పరిస్థితిని సమీక్షీస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల్లో అధికారుల బృందాలు మిడుతల దండు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. రాత్రివేళ మిడుతల దండు తిష్టవేసే ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును ( Pesticides ) పిచికారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ( Also read: COVID-19: జేసీబీతో కరోనా రోగి మృతదేహం తరలింపు.. సీఎం జగన్ సీరియస్ )


మిడతల దండుతో ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలు ఝాన్సీ, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్, భడోహి, జౌన్‌పూర్, అజమ్‌ఘడ్, అంబేద్కర్ నగర్, సుల్తాన్‌పూర్, గోరఖ్‌పూర్‌తోపాటు మరో ఎనిమిది సరిహద్దు జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..