Locusts swarms attacks: మిడతల దండు నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పింది. మిడుతల దండు ( Locusts swarms ) తెలంగాణ సరిహద్దులకు 200 కిమీ సమీపానికి రావడంతో అవి ఏ క్షణమైనా తెలంగాణలోకి ( Telangana ) ఆ తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ( Andhra Pradesh ) ప్రవేశిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.
కరోనావైరస్ కాలం ( Corona crisis ) అన్నింటినీ మార్చేసింది. సినిమాను కూడా... ఇకపై సినిమాను సినిమాగా మాత్రమే కాకుండా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్లానూ చూడొచ్చేమో!!. మనం ఇప్పుడిలా చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. కొన్ని తమిళ సినిమాలు ముందు కల్పితాలుగా తెరకెక్కినా... తరువాత కాలంలో అందులో ప్రస్తావించాల్సిన అంశాలే ఏదో ఓ రూపంలో నిజ జీవితంలో దర్శనమిస్తున్నాయి ( Tamil movies predicting future ) .
రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోని గ్రామాల రైతులను ఇప్పుడు మిడతలు వేధిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటుకుని భారీ సంఖ్యలో దేశంలోకి ప్రవేశిస్తోన్న మిడతలు అక్కడి వేలాది ఎకరాల్లోని పంట పొలాలపై దాడి చేసి నిమిషాల్లోని పంటలను పిండి చేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే పంటంతా నాశనం అవుతుండటంతో ఆ మిడతలను ఎలా పారదోలాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి ఎగిరొస్తున్న మిడతలు భారత్లోని రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.