లోక్ సభ ఎన్నికలు: కొత్త ఓటర్లే కోటిన్నర మంది
లోక్ సభ ఎన్నికలు: కొత్త ఓటర్లే కోటిన్నర మంది
న్యూఢిల్లీ: ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానున్న తొలి దశ పోలింగ్ మొదలుకుని మే 19న జరగనున్న 7వ దశ పోలింగ్ వరకు ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు దాదాపు 90 కోట్ల మంది ఓటర్లు అర్హులైనట్టు నిన్న భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏళ్ల వయస్సు వారే ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 1.66 శాతం ఓటర్లు ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారేనని ఈసి తెలిపింది.
2014 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 814.5 మిలియన్స్ కాగా 2019 ఎన్నికల నాటికి నమోదైన ఓటర్ల సంఖ్య 900 మిలియన్స్‌కి చేరింది. క్రితం ఎన్నికలతో పోలిస్తే, ఈ ఎన్నికల సమయానికి 84 మిలియన్స్ ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసి పేర్కొంది. 2012 నుంచి 38,325 మంది ట్రాన్స్‌జండర్స్ ఇతరుల కేటగిరి కింద ఓటు హక్కు పొందారు.