Election Commission To Announce Parliament And 5 States Schedule: సమ్మర్ ప్రజలకు బంపర్ బోనాంజాగా మారింది. ఇటు సమ్మర్ హీట్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలోనే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను రేపు (మార్చి 16)  విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేయనున్నాట్లు సమాచారం. దీనిలో ముఖ్యంగా... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంట్ తో పాటు ఈ కింది రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 


1. ఆంధ్ర ప్రదేశ్
2. ఒడిషా
3. అరుణాచల్ ప్రదేశ్
4. సిక్కిం
5. జమ్ము కాశ్మీర్ (ఇది ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఉంటుంది)


అదే విధంగా తెలంగాణలో ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే  లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనికి  కూడా ఉప ఎన్నికలకు షెడ్యూల్ వెలువడునున్నట్లు సమాచారం. ఇక మరోవైపు.. కేంద్ర ఎన్నికల సంఘంకు ఇద్దరు కొత్తగా బ్యూరోక్రాట్లను ఎంపిక చేశారు.


Read More: Electoral Bonds: ఎలక్ట్రోరల్ బాండ్స్.. మరో సంచలన ఆదేశం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం..


రాబోయే లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనల్ రాజీవ్ కుమార్ ఎన్నికలపై కసరత్తును ప్రారంభించారు. కేరళ నుంచి జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌ నుంచి సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఎన్నికల కమిషనర్‌లుగా ఎంపికయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. ఇక.. కొత్తగా ఎంపికైన కమిషన్లు ఈరోజు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఇక మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే, ఆయాప్రాంతాలలో ఎన్నికల కోడ్ అమలులో రానుంది. 


Read More: BackPain: నడుము నొప్పితో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter