Lok Sabha Elections 2024: రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో మరోసారి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్టీయే కూటమి గెలుపు ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అంటూ కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు బీజేపీ చెబుతున్న 370 సీట్లు కాకుండా.. 300 పైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుంది. అంతేకాదు తూర్పు భారత దేశంలో పశ్చిమ బెంగాల్, ఒడిషాలో మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. అంతేకాదు దక్షణాదిలో కర్ణాటక కాకుండా తెలంగాణ, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ సీట్లు.. ఓట్ల శాతం గణనీయమైన పురోగతి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఎడిట్లరకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది..


ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీ (BJP)కి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుందని చెప్పారు. ఆ పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) క్రాస్ చేయడం అసాధ్యమేమి కాదన్నారు. ఇక బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలున్నా.. చేజేతూల కాలదన్నారని చెప్పుకొచ్చారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. ఫస్ట్ ప్లేస్ లేదా సెకండ్ ప్లేస్‌లో నిలిచే అవకాశాలున్నాయన్నారు. ఆ పార్టీకి ఇది పెద్ద బూస్టప్ లాంటిదని చెప్పారు. ఒడిశాలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్నారు. అక్కడ నెంబర్ ప్లేస్‌లో నిలిచే అవకాశాలున్నాయి. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌లో కూడా మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. తమిళనాడులో రెండంకెల ఓట్ల శాతం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ ప్రదేశ్, బిహార్, కేరళలో కలిపి 204 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2014లో 29 సీట్లు గెలిచిందన్నారు. 2019లో 47 స్థానాల్లో విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎక్స్‌పెక్ట్ చేస్తోన్న 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు.


అంతకాదు ఉత్తర భారతం, పశ్చిమ భారత దేశంలో బీజేపీ తన పట్టును నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్నారు ప్రశాంత్ కిషోర్. దక్షిణ, తూర్పు భారత దేశంలో పార్టీని విస్తరించేందకు మోదీ, అమిత్ షా తరుచూ ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన పోటీ ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్‌లో ఉటే మణిపూర్, మేఘాలయలో పర్యటించి లాభం ఏంటని రాహుల్, సోనియా గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు.


హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో విజయమే కీలకం..
భారతీయ జనతా పార్టీకి గట్టు పట్టున్న హిందీ రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్డడం అంత ఈజీ కాదన్నారు ప్రశాంత్ కిషోర్. అందుకే నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు యూపీ నుంచి పోటీ చేశారన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆర్జీడీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు తమకు ఎంతో పట్టున్న స్థానాల్లో బీజేపీని నిలువరించలేకపోతున్నాయన్నారు. ఇండి కూటమికి ఒక జెండా.. అజెండా లేవన్నారు. ఒక వాదంతో ఉమ్మడి ఆమోదం పొందని వ్యక్తి లేరని చెప్పుకొచ్చారు.


ప్రతిపక్షాలు చేతులారా జార విడుచుకున్న అవకాశాలు..


ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ సుధీర్ఘ ఆధిపత్యం లభిస్తుందన్న దానిపై ప్రశాంత్ కిషోర్ తన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అది పెద్ద జోక్ అన్నారు. 1984లో కాంగ్రెస్‌కు 400 పైగా స్థానాల్లో ప్రజలు అధికారం కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ క్రమంగా దిగజారుతూ వచ్చిందన్నారు. 2014 తర్వాత బీజేపీపై ఆధిపత్యం సాధించేందుకు ప్రతిపక్షాలకు అవకాశాలు లభించాయన్నారు. కానీ వాటిని చేజేతూలా చేజార్చుకున్నాయన్నారు. 2015, 2016లో బీజేపీ కేవలం ఒక్క అస్సాంలో మాత్రమే విజయం సాధించింది. పలు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కానీ బీజేపీ పుంజుకోవడానికి ప్రతిపక్షాలు ఛాన్సులు ఇచ్చాయి. నోట్ల రద్దు తర్వాత కూడా అలాంటి బిగ్ ఛాన్స్ వచ్చింది. 2018లో ఆ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో ఓటమి అంచు వరకు వచ్చింది. 2020 కరోనా సమయంలో ప్రజల్లో మోదీకి ఉన్న ఆమోదం దిగజారింది. ఈ సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు టైమ్ పాస్ చేసాయి. కానీ తిరిగి పుంజుకునేందుకు ఆయనకు అవకాశమిచ్చాయి. ఆయన ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని జార విడుచుకున్నాయని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.  ఈ సారి లోక్ సభ ఎన్నికలలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.


Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook