Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన `ఓటు`.. వడదెబ్బతో రాలిన పండుటాకులు
Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
Voters Died: సార్వత్రిక ఎన్నికలు కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఓటు వేసేందుకు వచ్చి ఓటర్లు మృతి చెందడం కలచివేస్తోంది. ఎండల ధాటికి తట్టుకోలేక పండుటాకులు కుప్పకూలిపోయారు. ఈ ఘటనలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవడంతో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు.
Also Read: Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్, బిర్యానీ, ఫ్రీ రైడ్
ప్రస్తుతం వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడు లేనట్టుగా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కేరళలోని పాలక్కాడ్, మలప్పురం, అలప్పుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు ఎండ వేడికి తట్టుకోలేక మృతి చెందారు. కోజికోడ్‌లో అయితే పోలింగ్ ఏజెంట్ మృతి చెందడం గమనార్హం.
Also Read: Nominations End: ముగిసిన నామినేషన్ల పర్వం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు
ఒట్టపాలెంలో ఓటు వేసిన తర్వాత 68 ఏళ్ల ఓటరు మరణించాడు. తిరూర్‌లో ఓ మదర్సా టీచర్ ఓటు వేసి ఇంటికి రాగా.. ఉన్నఫలంగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోపు ఆమె మృతి చెందింది. అలప్పుజాలో ఓటు వేసి ఇంటికి వెళ్లిన 82 ఏళ్ల సోమరాజన్ వడదెబ్బకు గురయి ప్రాణాలు కోల్పోయాడు. ఇక కర్ణాటకలోని మైసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పండు ముసలావిడ ఎండలకు తాళలేక మృతి చెందింది. మైసూరుకు చెందిన పుట్టమ్మ (91) పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది. ఎండలోనే ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యింది. ఇంట్లోనే మృతి చెందింది.
ఎండలు తీవ్రంగా ఉండడంతో పోలింగ్ సమయం పెంచాలని విజ్ఞప్తులు వచ్చినా కూడా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఓటు వేసేందుకు వచ్చిన వారు వడదెబ్బకు గురయ్యారు. ఎండలో వచ్చిన వారు ఇంటికి వెళ్లేలోపు కుప్పకూలిపోతున్నారు. మరికొన్ని చోట్ల కూడా మరణాలు సంభవించి ఉంటాయని తెలుస్తోంది. ఎండలకు తాళలేక పలువురు ఓటర్లు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికల్లోనైనా ఎన్నికల సంఘం ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter