Nominations: సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే దశలో జరగనున్న ఎన్నికకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలు, 176 అసెంబ్లీ స్థానాలకు (తెలంగాణలోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక) సంబంధించి నామినేషన్లు పూర్తవగా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల పర్వం పూర్తవడంతో రాజకీయ పార్టీలు ఇక ప్రచార జోరు పెంచనున్నాయి.
Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్ చేస్తా: కేసీఆర్
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 547 మంది నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ ఇప్పటివరకు ఆ వివరాలు అందలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ స్థానంలో పదికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
ఉరుకులు పరుగులు
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు సమయానికే నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆఖరి రోజు వరకు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఆశావహులు అభ్యర్థిత్వం ప్రకటించకుందే నామినేషన్లు వేశారు. నిన్న ముగ్గురు అభ్యర్థులను ప్రకటించగా వారు ఈరోజు హుటాహుటిన నామినేషన్లు సమర్పించారు. ఇక బీజేపీ నాయకులు ఆలస్యంగా నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో..
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం రికార్డుగా అధికారులు భావిస్తున్నారు.
నామినేషన్లు పూర్తవడంతో శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు సమర్పించని వారివి అధికారులు తిరస్కరిస్తారు. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన తుది ఫలితాల వెల్లడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter