న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 46కు పైగా మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, రెండవ దశ  పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కాగా విపక్ష పార్టీల తీవ్ర నిరసనల మధ్య వాయిదాల మీద వాయిదాల పర్వం కొనసాగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్ సభలో కాసేపు అధికార విపక్షాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాంగ్రెస్ సభ్యులు ఒకరినొకరు నెట్టివేసుకోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గోగోయి, మణికం ఠాగూర్ వాయిదా తీర్మానం కోసం ఒత్తిడి చేశారు. 


కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహం వెలుపల నిరసన చేపట్టారు. సభ ప్రారంభం కాకముందే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.  ఎంపీలు కళ్ళకు నల్ల వస్త్రం ధరించి నిరసన తెలిపారు. 


శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీని ఫలితంగా భయంకరమైన వాతావరణం నెలకొందని, కాల్పులు జరిగాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ ఇమేజ్‌ను దెబ్బతీసిందని అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..