Lok Sabha Speaker Election: స్వాతంత్య్ర భారతంలో తొలిసారి స్పీకర్ కు ఎన్నిక జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. కానీ గతంలో రెండు మూడు సార్లు స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. తొలి లోక్ సభ కొలువు తీరిన 1952లో జీవి మౌలాంకర్ Vs శంకర్ శాంతారామ్ మోర్ మధ్య పోటీ నెలకొంది. 1967లో నీలం సంజీవ్ రెడ్డి Vs తెన్నేటి విశ్వనాథం మధ్య స్పీకర్ పదవి విషయమై ఎన్నిక జరిగింది. అటు 1976లో బీఆర్ భగత్ వర్సెస్ జగన్నాథ్ రావు  జోషి మధ్య కూడా పోటీ నెలకొంది. ప్రతి సారి లోక్ సభ ఎన్నికల తర్వాత స్పీకర్ ఎన్నిక జరగుతూ వస్తోంది. ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తరుపున ఓం బిర్లా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసారు. అటు విపక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి నేతలు కే. సురేశ్ ను బరిలో దింపాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని అడిగినా.. స్పందించకపోవడంతో స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా.. తమ తరుపున అభ్యర్ధిని నిలబెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్ సభ స్పీకర్ ఎన్నిక కోసం అధికార, విపక్ష ఎంపీలు ఉదయం 11 నుంచి ఓటింగ్ లో పాల్గొననున్నారు. స్పీకర్ గా.. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యే వ్యక్తిగా విధిగా లోక్ సభ సభ్యుడై ఉండాలి. అయితే, స్పీకర్‌ను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట అర్హతను ఏది లేదు. లోక్‌సభ స్పీకర్‌గా తరచుగా అధికార పార్టీ సభ్యుడు ఎన్నుకోబడతూ వస్తున్నారు. లోక్ సభ కార్యకలాపాలు లోక్ సభ స్పీకర్ అని పిలవబడే ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలో జరుగుతూ ఉంటాయి. లోక్‌సభ స్పీకర్  సభ రోజువారీ పనితీరుకు అధ్యక్షత వహించడం.


లోక్ సభలోని 542 మంది ఎంపీలున్నారు. వాయనాడ్ కు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఒకటి ఖాళీగా ఉంది. ఇందులో ఎన్డీయే పార్టీకి 293 ఎంపీల బలం ఉంది.  అందులో కేవలం భారతీయ జనతా పార్టీకి 240 సభ్యుల మద్దతు ఉంది. లోక్ సభ అభ్యర్ధులో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక అవుతారు. కాంగ్రెస్ పార్టీకి 98 మంది, మొత్తం విపక్ష కూటమికి కలిపి 235 మంది ఉన్నారు. స్వాతంత్య్ర అభ్యర్ధులు ఎవరికీ మద్దతు ఇస్తారనేది కీలకంగా మారింది.  సంఖ్యా బలం బట్టి చూస్తే NDA తరుపున ఓం బిర్లా రెండో సారి ఎన్నిక కావడం లాంఛనమే. రెండోసారి ఎన్నికైతే.. వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా రికార్డులకు ఎక్కుతారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బలరాం జాఖర్ రెండుసార్లు లోక్ సభ స్పీకర్ గా  బాధ్యతలు నిర్వహించారు.అటు అనంత శయనం అయ్యంగార్, జీఎంసీ బాలయోగి రెండు సార్లు  లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక కాబడ్డారు.


లోక్‌సభ స్పీకర్ 5 సంవత్సరాలు (అతను ఎన్నికైన రోజు నుండి తదుపరి లోక్‌సభ మొదటి సమావేశానికి ముందు వరకు) పదవిలో కొనసాగుతారు. లోక్‌సభ స్పీకర్‌ను కూడా తిరిగి ఎన్నుకోవచ్చు మరియు లోక్‌సభ రద్దు చేయబడిన వెంటనే అతను ఆ పదవిని ఖాళీ చేయరు.  లోక్ సభ స్పీకర్ లోక్ సభ సభ్యుడు కాకపోయినా, స్వయంగా వ్రాతపూర్వకంగా రాజీనామా చేసినా లేదా ఎక్కువ మెజారిటీతో తొలగించబడినా మాత్రమే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.


Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter