Loksabha Elections 2024 Arrangements: దేశంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దేశంలో లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా ఏపీ, తెలంగాణలో 4వ దశలో జరగనున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా, పూర్తిగా కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీలపై నిరంతరం నిఘా ఉందని, ఈడీ. ఐటీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రైవేట్ విమానాలు, హెలీకాప్టర్లలో కూడా సోదాలు జరుగుతాయన్నారు. వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధులకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో సీఆర్పీఎఫ్ బలగాలు. హింస లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. 85 ఏళ్లు దాటినవారికి ఓట్ ఫ్రం హోం సౌకర్యం తొలిసారిగా కల్పించనున్నారు. 


దేశంలో మొత్తం 96.8 కోట్ల ఓటర్లు ఉంటే అందులో మహిళా ఓటర్లు 47.1 కోట్లు, పురుషులు 49.7 కోట్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓట్లు 48 వేల వరకూ ఉన్నాయి. తొలిసారి ఓటు వేస్తున్నవారి సంఖ్య 1.82 కోట్లుగా ఉంది. దేశంలో ఎన్నికలకు 1 కోటి 50 లక్షలమంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 55 లక్షల ఈవీఎం మెషీన్లను ఈసారి వినియోగించనున్నారు. 2100 అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 


లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ఎన్నికల పోలింగ్ 21 రాష్ట్రాల్లో జరగనుంది. ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన ఉంటుంది. ఇక నాలుగో దశ పోలింగ్ మే 13వ తేదీన ఉంటుంది. ఐదవ దశ పోలింగ్ మే 20 న జరగనుంది. ఆరవ దశ పోలింగ్ మే 25వ తేదీన జరగనుండగా, చివరి దశ 7వ దశ పోలింగ్ జూన్ 1న ఉంటుంది


Also read: Loksabha Elections 2024 Schedule: దేశంలో 7 దశల్లో ఎన్నికలు, ఏ దశలో ఎప్పుడెప్పుడు తేదీలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook