Loksabha Elections 2024 Schedule: దేశంలో 7 దశల్లో ఎన్నికలు, ఏ దశలో ఎప్పుడెప్పుడు తేదీలు ఇలా
Loksabha Elections 2024 Schedule: దేశంలో 18వ లోక్‌సభకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో జరిపినట్టే ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరపనుంది. మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ, 26 అసెంబ్లీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024 Schedule: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ అయింది.
ఈసారి లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ఎన్నికల పోలింగ్ 21 రాష్ట్రాల్లో జరగనుంది. ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మూడో దశ పోలింగ్ మే 7వ తేదీన ఉంటుంది. ఇక నాలుగో దశ పోలింగ్ మే 13వ తేదీన ఉంటుంది. ఐదవ దశ పోలింగ్ మే 20 న జరగనుంది. ఆరవ దశ పోలింగ్ మే 25వ తేదీన జరగనుండగా, చివరి దశ 7వ దశ పోలింగ్ జూన్ 1న ఉంటుంది. జూన్ 4వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.
లోక్‌సభ తొలి దశ నోటిఫికేషన్ మార్చ్ 20
నామినేషన్ల గడువు తేదీ మార్చ్ 27
నామినేషన్ల ఉపసంహరణ మార్చ్ 30
పోలింగ్ ఏప్రిల్ 19
లోక్‌సభ రెండో దశ నోటిఫికేషన్ మార్చ్ 28
నామినేషన్ల గడువు ఏప్రిల్ 4
నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 8
పోలింగ్ ఏప్రిల్ 26
లోక్‌సభ మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12
నామినేషన్ల గడువు ఏప్రిల్ 19
నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 22
పోలింగ్ మే 7
లోక్‌సభ నాలుగో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 18
నామినేషన్లకు గడువు ఏప్రిల్ 25
నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29
పోలింగ్ మే 13
లోక్‌సభ ఐదవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 26
నామినేషన్ల గడువు మే 3
నామినేషన్ల ఉపసంహరణ మే 6
పోలింగ్ మే 20
లోక్‌సభ ఆరవ దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 29
నామినేషన్ల గడువు మే 6
నామినేషన్ల ఉపసంహరణ మే 9
పోలింగ్ మే 25
లోక్‌సభ ఏడవ దశ నోటిఫికేషన్ మే 7
నామినేషన్ల గడువు మే 14
నామినేషన్ల ఉపసంహరణ మే 17
పోలింగ్ తేదీ జూన్ 1
Also read: AP ELections 2024 Date: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook