AP ELections 2024 Date: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీ ఎప్పుడంటే

AP ELections 2024 Date: దేశంలో 18వ లోక్‌సభకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్లమంది ఓటర్లు ఓటేసేందుకు సిద్గంగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2024, 04:12 PM IST
AP ELections 2024 Date: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీ ఎప్పుడంటే

AP ELections 2024 Date: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు అందించారు. దేశంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఏపీలో మాత్రం ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుండగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 

ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ సమయం ఉంటుంది. జూన్ 24 వరకూ ఏపీ అసెంబ్లీకు గడువు ఉంది. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. నాలుగో దశలో ఏపీ అసెంబ్లీతో పాటు ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ, తెలంగాణ నోటిఫికేషన్ ఏప్రిల్ 18

నామినేషన్లకు గడువు ఏప్రిల్ 25

నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26

నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29

మే 13న పోలింగ్

జూన్ 4 ఫలితాలు

Also read: Mudragada Padmanabham: జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News