Coronavirus: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్, ఆందోళనలో ఎంపీలు
Coronavirus: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన బడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Coronavirus: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన బడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ (Corona virus)కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మరోసారి రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తోంది. తాజాగా ఓం బిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఓం బిర్లాకు చికిత్స అందిస్తున్నామని..ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో(Loksabha budget sessions) పాల్గొన్న స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకడంతో పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతో జనవరి 19న ఓం బిర్లా ( Om Birla) పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది.
గత 24 గంటల్లో దేశంలో 43 వేల 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 1 కోటి 15 లక్షల 99 వేల 130కు చేరుకుంది. అటు రికవరీ రేటు 96.12 శాతానికి తగ్గింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 27 వేలకు పైగా కేసులు నమోదవడంతో ఆందోళన పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్ర నుంచే కావడం కలవరం కల్గిస్తోంది.
Also read: Twitter new feature: ట్విట్టర్‌లో త్వరలో సరికొత్త ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook