న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు కరోనా నాదిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతున్నాయి. నగరాల్లో పోలీసులు కకట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తూ.. అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం పౌరులనుద్దేశించి 21 రోజులు పాటు ఇంట్లోనే ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన చిరంజీవి


అయితే ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించడంతో నగరాల్లో పనిచేసే దినసరి కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు బతుకుదెరువుకోసం వచ్చిన వ్వారు ఎక్కడికక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. 


ఇదిలాఉండగా అవధేష్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఉన్నవోలోని తన కర్మాగారం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాబంకిలోని తన గ్రామానికి రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోవడంతో కాలినడకన నడవడం ప్రారంభించాడు. ఓ వైపు పోలీసులు ఎక్కడికక్కడే నిలుపుదల చేస్తున్నారు.అవదేశ్ స్పందిస్తూ కాలినడక తప్ప నాకు వేరే  మార్గం లేదని ఎన్డిటివితో అన్నారు. 


Read Also: 'కరోనా' మాటున అక్రమార్జనకు ప్లాన్


కరోనావైరస్ వ్యాప్తిని సమూలంగా నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లోని సరిహద్దులు ఇప్పటికే మూసివేశారు. ఈ లాక్ డౌన్ తో ఒక్కసారిగా అన్నీ రంగాల్లో లక్షలాది మందికి ఎటువంటి ఆశ్రయం, రవాణా మార్గాలు లేకుండా స్తంభించిపోయాయి. 


నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలకు అవకాశం ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని విజ్ఞప్తి చేశారు. కాగా సుదీర్ఘ సమీక్షలో సహచర మంత్రులతో కూడా సోషల్ డిస్టెన్స్ ను పాటించారు. తదనంతరం ప్రధాని మోదీ దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు రూ. 2 లకే కిలో బియ్యాన్ని సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..