'కరోనా' మాటున అక్రమార్జనకు ప్లాన్

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ..హ్యాండ్ శానిటైజర్లు వాడాలని.. ముఖానికి మాస్కులు ధరించాలని ప్రచారం చేస్తున్నాయి.

Last Updated : Mar 25, 2020, 02:57 PM IST
'కరోనా' మాటున అక్రమార్జనకు ప్లాన్

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ..హ్యాండ్ శానిటైజర్లు వాడాలని.. ముఖానికి మాస్కులు ధరించాలని ప్రచారం చేస్తున్నాయి. 

దీంతో చాలా దేశాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులకు కొరత ఏర్పడుతోంది. భారత దేశంలోనూ ఈ రెండూ లభించడం లేదు. నిజానికి గిరాకీ ఎక్కువవడం వల్ల ఈ రెండు వస్తువులు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లినా 'లేదు' అనే  సమాధానమే వినబడుతోంది. మరోవైపు లాక్ డౌన్ కారణంగా చాలా దుకాణాలు మూసివేశాలు. దీంతో జనం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. 

కేంద్ర కేబినెట్ సమావేశంలో సోషల్ డిస్టన్స్

ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తమ వద్ద ఉన్న నిల్వలను అక్రమంగా దాచేసి.. ప్రస్తుతం ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు  ప్లాన్ వేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అలాంటి గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. 

అక్రమంగా దాచి ఉంచిన టన్నుల కొద్దీ ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.  అంటే అక్రమార్కులు ఎంత పెద్ద ప్లాన్ వేశారో అర్ధం చేసుకోవచ్చు. కృత్రిమ కొరత సృష్టించి జనం నుంచి  అందినకాడికి దోచుకుందామని ప్లాన్ వేశారు. ఇప్పుడు పోలీసులు పట్టుకోవడం మొదటికే మోసం వచ్చింది. 

మరోవైపు ఇలాంటి అక్రమార్కుల గురించి ఎవరికి తెలిసినా తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలా మాస్కులు అక్రమంగా నిల్వ చేసే వారు  అసలు విషయం ఆలోచించడం  లేదు. మాస్కులు, శానిటైజర్లు లేని కారణంగా చాలా మందికి కరోనా వైరస్ వ్యాపిస్తే.. పెద్ద ఉపద్రవమే వచ్చి పడితే.. నిల్వ చేసిన మాస్కులు వారు ఎవరికి విక్రయిస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News