మహారాష్ట్ర: నాగ్ పూర్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుఝామున ఓ పాడుబడ్డ చెరువులో ప్రేమ జంట శవాలు కనిపించాయి. అంబాఝురీ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుుకుంది. కాగా చెరువలో తేలుతున్న శవాలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు..చెరువులో తేలుతున్న శవాలను ఈతగాళ్ల ద్వారా బయటికి తీయించారు. ఈ శవాలు బయటికీ తీసి పరిశీలించగా ఇరువురి చేతలు కట్టేసి ఉన్నాయి. ఇద్దరి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటందని పోలీసులు పేర్కొన్నారు.


మృతదేహాలని పోస్టు మార్టంకు తరలించిన పోలీసులు ..ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా హత్య చేసి ఇందులో పడేశారా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. కాగా మృతదేహాలు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగ్‌పూర్ లోని అంబాఝురీ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటనతో స్థానికలం సంచలనం రేకెత్తిస్తోంది