Kolkata murder case: మీ వాయిస్ తగ్గించుకొండి.. కోల్ కతా ఘటన విచారణ వేళ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సీరియస్...
Cjis dy chandrachud serious on lawyer: కోల్ కతా ఘటనలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్.. కొంత మంది లాయర్ లపై మండిపడ్డారు.
Kolkata doctor murder case hearing: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఈరోజు మారో మారు ఈ కేసు విషయంలో విచారణ జరిగింది. ఆగస్టు 9 న జరిగిన ఈ ఘటనకు సరిగ్గా నెల రోజులు గడిచిపోయింది. దీంతో ఈ ఘటనపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు నడుస్తాయి.. సుప్రీంకోర్టు ఎలాంటి స్పందన తెలయజేస్తుందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో ఈరోజు .. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కోల్ కతా కేసును విచారించింది.
వాదనల సందర్భంగా... సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటన అనంతరం నిరసనకారులపై ఒక న్యాయవాది రాళ్లు విసిరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. తమ వద్ద ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న.. మరో న్యాయవాది కౌస్తవ్ భాగ్చి మాట్లాడుతూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆయన కపిల్ సిబాల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.
కోర్టులోనే లాయర్ల మధ్య వాదన జరిగింది. దీంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కల్గజేసుకున్నారు..లాయర్.. భాగ్చిని గొంతుసవరించుకొవాలని అన్నారు. కోర్టులో,ముగ్గురు అత్యున్నత సీనియర్ జడ్జీల ముందు ఇలాగేనా మాట్లాడేదని అంటూ చురకలంటించారు. ఇలాంటి వాటిని ధర్మాసనం సహించబోదని అన్నారు. దీంతో.. వెనక్కు తగ్గిన లాయర్ కౌస్తవ్ భాగ్చి క్షమాపణలు చెప్పారు.
అదే సమయంలో.. ఏడెనిమిది మంది న్యాయవాదులు ఒకేసారి వాదనలు వినిపిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకే సమయంలో అంత మంది వాదించడం సరికాదని కూడా డీవై చంద్రచూడ్ తెల్చి చెప్పారు.మరోవైపు వారంలోగా.. కోల్ కతా ఘటనపై కొత్త రిపోర్టును ఇవ్వాలని కూడా సుప్రీంకోర్ట్ సీబీఐ ని ఆదేశించింది. సెప్టెంబర్ 17 కు మరోసారి కేసును వాయిదావేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.