LPG Cylinder Latest Price: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించాయి. రూ.198 మేర ధర తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో ఇదివరకు రూ.2219గా ఉన్న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2021కి దిగి వచ్చింది. తగ్గిన ధరలు నేటి (జూలై 1)నుంచే అమలులోకి రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గృహావసరాలకు వినియోగించే 14 కేజీల సిలిండర్‌పై మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి రిలీఫ్ ప్రకటించలేదు. ఆయిల్ కంపెనీలు సాధారణంగా ప్రతీ నెలా 1వ తేదీన సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఇవాళ జూలై 1వ తేదీ కావడంతో ధరలను సవరించాయి. తాజాగా తగ్గిన ధరలతో ముంబైలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2186కి తగ్గగా, కోల్‌కతాలో రూ.2140కి దిగిరానుంది.


కాగా, గత జూన్ 1న ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు రూ.2354గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.2219కి దిగివచ్చింది. తాజా తగ్గింపుతో ధర మరింత తగ్గడంతో చిరు వ్యాపారులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. 
 



Also Read: TRS VS BJP: ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో ఏం జరగబోతోంది?


Also Read: Horoscope Today July 2022: జూలై నెలలో ఈ నాలుగు రాశువారికి ఆర్థికపరమైన సమస్యలు.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.