LPG Cylinder Price: మరోసారి భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... బిగ్ షాక్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు...
LPG Cylinder Price: పాలు, వంట నూనెలు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్... ఇలా నిత్యావసర వస్తువుల ధరలన్నీ మోత మోగుతున్నాయి. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది.
LPG Cylinder Price: 'ధరల పెంపు' దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నిత్యావసర వస్తువులపై ధరల బాదుడుకు సామాన్యుడు కుదేలవుతున్నాడు. వచ్చిన జీతం వచ్చినట్లు ఖర్చులకే పోతున్న పరిస్థితి. ఇక కూలీ, నాలీ చేసుకునే పేదల పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు చిరు వ్యాపారులకు మరోసారి షాకిచ్చాయి.
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి. రూ.102.50 మేర ధరను పెంచడంతో ప్రస్తుతం 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2355.50కి చేరింది. ఇంతకుముందు ఇదే సిలిండర్ ధర రూ.2253గా ఉంది. 14 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
ప్రతీ నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇవాళ (మే 1) ధరల సవరింపు చేపట్టిన కంపెనీలు... 19 కేజీల సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2355.50 ఉండగా.. ముంబైలో రూ.2329.50, చెన్నైలో రూ.2508, కోల్‌కతాలో రూ.2477.50, హైదరాబాద్‌లో రూ.2563.50కి చేరింది.
గత నెలలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.250 మేర పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.102.50 మేర ధరను పెంచడంతో రెండు నెలల వ్యవధిలోనే ధర రూ.350 మేర పెరిగినట్లయింది. పెరిగిన ధరలతో చిన్న చిన్న టీ స్టాల్స్, హోటళ్లు నడుపుకునే చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TSRTC Bus Pass Discount: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్..
Also Read: Horoscope Today May 1st 2022: ఆ రాశి వారికి హెచ్చరిక.. తెలిసిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేసే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.