LPG Price Hike: ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టునున్నారు. దీనికి ముందే సామాన్యులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎల్ పీజీ గ్యాస్ ధరలను పెంచేసింది. ఇది సమాన్య వినియోగదారులకు పెనుభారంగా మారనుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం వాణిజ్య LPG ధర పెంపును ప్రకటించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఈ ధరలు సామాన్యుపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఐఓసీఎస్ వెబ్ సైట్ ప్రకారం 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్‌ల ధర రూ. 14 పెరిగింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అంటే ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ ధరలు యధాతధంగానే ఉన్నాయి. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి.


దీంతో రాష్ట్రాలవారీగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1769కు చేరింది. కోల్‌కతాలో రూ. 1887. ముంబై ధర రూ. 1723. చెన్నై రూ. 1937. ఏపీ, తెలంగాణలో 14.2 కేజీల సిలిండర్ ధరలు రూ. 960 దగ్గర్లో ఉన్నాయి.డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ ధరలు స్థానిక పన్నుల ఆధారంగా వంటగ్యాస్ ధరలు రాష్ట్రాలవారీగా మార్పులు ఉంటాయి. ఇదిలా ఉండగా దేశీయ సిలిండర్ ధరలలో చివరి సవరణ ఈ ఏడాది మార్చి 1న జరిగింది.



ఇదీ చదవండి: Jobs: డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. రూ.55,000 జీతంతో సూపర్ జాబ్.. చివరితేదీలోపు దరఖాస్తు చేసుకోండి..



ఇదీ చదవండి: Cashless Everywhere: ఇక దేశంలో ఎక్కడైనా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఆరోగ్యబీమా నిబంధనల్లో మార్పు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook