Jobs: డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. రూ.55,000 జీతంతో సూపర్ జాబ్.. చివరితేదీలోపు దరఖాస్తు చేసుకోండి..

NTPC Recruitment 2024: ఇంజినీరింగ్ పట్టాదారులకు NTPC గుడ్ న్యూస్ చెప్పింది. NTPC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 09:21 AM IST
Jobs: డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. రూ.55,000 జీతంతో సూపర్ జాబ్.. చివరితేదీలోపు దరఖాస్తు చేసుకోండి..

NTPC Recruitment 2024: ఇంజినీరింగ్ పట్టాదారులకు NTPC గుడ్ న్యూస్ చెప్పింది. NTPC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఆన్‌లైన్ భర్తీ కోసం అధికారిక వెబ్‌సైట్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేస్తుకోవడానికి చివరి తేదీ 2024 ఫిబ్రవరి 8. ఈలోగా అప్లై చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు..
మొత్తం 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీకి ఆహ్వానం పలికింది. NTPC దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి 300 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ , మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొంది ఉండాలి.

వయస్సు: 2024 ఫిబ్రవరి 8 నాటికి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపికైన అభ్యర్థులు నెలవారీ జీతం రూ. 55,000 పొందుతారు. అదనంగా, ఇంటి అద్దె అలవెన్స్ (HRA), కంపెనీ వసతి, వైద్యసదుపాయాలు కూడా పొందుతారు.

NTPC Careers.ntpc.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.  ఆన్‌లైన్ అప్లికేషన్ 25.01.2024న ప్రారంభమైంది. 08.02.2024న ముగుస్తుంది సమాచారం వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. 

ఇదీ చదవండి: Jobs in Supreme Court: లా పట్టాదారులకు గుడ్ న్యూస్.. రూ. 80 వేల జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..

ఇదీ చదవండి: Cashless Everywhere: ఇక దేశంలో ఎక్కడైనా క్యాష్ లెస్ ట్రీట్మెంట్.. ఆరోగ్యబీమా నిబంధనల్లో మార్పు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News