LPG cylinders explosion video: గ్యాస్ సిలిండర్ల ట్రక్ బోల్తా.. వరుసగా పేలిన సిలిండర్లు, మంటల్లో కాలిబూడిదైన స్కూల్ బస్సు
గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీకి చెందిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఉన్నట్టుండి అదుపుతప్పి బోల్తాపడింది. అదే సమయంలో ట్రక్కులోని బ్యాటరీ నుంచి వెలువడిన మిరుగుల కారణంగా ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి.
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీకి చెందిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఉన్నట్టుండి అదుపుతప్పి బోల్తాపడింది. అదే సమయంలో ట్రక్కులోని బ్యాటరీ నుంచి వెలువడిన మిరుగుల కారణంగా ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. అగ్నికి ఆజ్యంపోసినట్టు ట్రక్కులో సిలిండర్లు ఉండటంతో లీక్ అయిన సిలిండర్లు కొన్ని ఒకదాని తర్వాత మరొకటి పేలడటం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ముఖ్యంగా పేలిన సిలిండర్లు రోడ్డుకి ఇరువైపులా ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 300 వరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న మరో ఇసుక ట్రక్కును ఢీకొంది. అయితే, అప్పటికి అగ్ని ప్రమాదం తీవ్రత అంతగా లేకపోవడంతో వెంటనే స్థానికులు బస్సులోని చిన్నారులను క్షేమంగా అందులోంచి కిందకి దించి దూరంగా సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్కూల్ బస్సు సైతం అదే మంటల్లో కాలిబూడిదైంది. అంతకంటే ముందుగానే స్కూల్ బస్సులోని చిన్నారులను సురక్షిత ప్రదేశానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌కి చెందిన నాలుగు ఫైర్ ఇంజిన్స్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషిచేశాయి. ఘటనాస్థలంలో నీళ్లు చల్లి మరిన్ని సిలిండర్లు పేలకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిఖ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన అనంతరం సిలిండర్ల ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..