LPG Price Hike: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలెండర్ ధర, ఎల్పీజీ సిలెండర్ ధర ఏ నగరంలో ఎంతంటే
LPG Price Hike: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలెండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LPG Price Hike: దేశంలో గ్యాస్, ఇంధన ధరలు ఎప్పటికప్పుుడు పెరుగుతుంటాయి. ఇప్పుడు మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. ఈసారి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం పడనుంది. దేశవ్యాప్తంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
ఆయిల్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధరల్ని మరోసారి పెంచాయి. ఈసారి 19 కిలోల సిలెండర్‌పై 16.50 రూపాయలు పెరగనుంది. ఇటీవల నవంబర్ 1న 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర పెరిగింది. ఇప్పుడు మరోసారి పెరగడంతో వినియోగదారులకు తీవ్ర భారం కలుగుతోంది. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. 10 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర దేశవ్యాప్తంగా పెరిగింది. ఫలితంగా ఇప్పటి వరకూ 1802 రూపాయలున్న 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు 1818.50 రూపాయలుగా మారింది.
ఇక కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర 1911.50 రూపాయల నుంచి 1927 రూపాయలకు పెరిగింది. ఇక ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 1754.50 రూపాయల నుంచి 1771 రూపాయలైంది. ఇక చెన్నైలో 19 కిలోల గ్యాస్ సిలెండర్ ధర 1980.50 రూపాయల నుంచి 1964.50 రూపాయలకు పెరిగింది.
గత కొద్దికాలంగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధరలే పెరుగుతున్నాయి. 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 14 కిలోల గ్యాస్ సిలెండర్ ధర ఢిల్లీలో 801 రూపాయలు కాగా, కోల్‌కతాలో 829 రూపాయలు, ముంబైలో 802.50 రూపాయలు, చెన్నైలో 818.50 రూపాయలుంది. బెంగళూరులో 805.50 రూపాయలు హైదరాబాద్‌లో 855 రూపాయలుగా ఉంది.
Also read: Heavy Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.