Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకు 3709 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 450 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర దిశగా కదులుతోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఒడిశా, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు అన్నదాతలకు కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు జిల్లాలపై ఇప్పటి వరకూ అత్యధిక ప్రభావం పడింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఈసారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే వాతావరణంలో నెలకొన్న మార్పులతో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, విజయనవగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కోస్తాంధ్ర తీరంలో గంటకు 40-50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. మరోవైపు కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. వచ్చే 24 గంటల్లో వాయుగుండం కారణంగా విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: HBD YS Jagan Mohan Reddy: మొండోడే కాదు చాలా ఘటికుడే.. వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









