LPG Price Cut Down: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర
LPG Price Cut Down: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. త్వరలో మీ గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గనుంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే వివరాలు తెలుసుకుందాం.
LPG Price Cut Down: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల పేరుతో ఓ పధకం అమలు చేస్తోంది. ఈ పధకంలో గ్యాస్ సిలెండర్ ధర సాదారణ వినియోగదారులతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. రానున్న 8 నెలల కాలంలో లబ్దిదారులకు ఈ సిలెండర్ ధర మరింత తగ్గనుంది.
ప్రదానమంత్రి ఉజ్వల యోజనను కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. పీఎంయూవైగా పిలిచే ఈ పధకంలో గ్యాస్ కనెక్షన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ సిలెండర్ ప్రత్యేకమైన రాయితీతో లభిస్తుంది. సాధారణ గ్యాస్ వినియోగాదారులతో పోలిస్తే ప్రధానమంత్రి ఉజ్వల పధకంలో గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ఉజ్వల పధకంలో గ్యాస్ సిలెండర్‌పై ఇచ్చే రాయితీని కొనసాగించేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది అంటే 2025 మార్చ్ 31 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల పధకంలో రాయితీ కొనసాగనుంది. అంటే మరో 8 నెలలు గ్యాస్ సిలెండర్ ఇతరులతో పోలిస్తే 300 రూపాయలు తక్కువకే లబించనుంది.
దేశంలో సాధారణ ప్రజలు వినియోగించే డొమెస్టిక్ 14.2 కిలోల గ్యాస్ సిలండర్ ధర 833 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో ఈ ధర 803 రూపాయలు. అదే ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఈ సిలెండర్‌పై 300 రూపాయలు డిస్కౌంట్ అనంతరం 500 రూపాయలకే లబించనుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం వంటి సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి. డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల ధరల్ని తగ్గించడం లేదా పెంచడం లేదా ఏ మార్పు లేకుండా ఉంచడం చేస్తుంటాయి. మొన్న జూలై 1న జరిగిన సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ ధరల్లో ఏ మార్పు చేయలేదు.
Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook