Madhya Pradesh Selfie Deaths: సెల్ఫీల మోజులో పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సెల్ఫీల సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బేతుల్ జిల్లాలోని (Betul district) రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు యువకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతలోనే ఓ రైలు వచ్చి వారిని ఢీకొట్టింది. ఇద్దరి యువకులు అక్కడిక్కడే మరణించారు. మచానా నదిపై (Machana River) ఉన్న రైల్వే వంతెనపై ఈ ఘటన జరిగినట్లు షాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి శివనారాయణ ముకాటి తెలిపారు.


"ముఖేష్ ఉయికే(21), మనీల్ మార్స్కోల్ (19) శనివారం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తమ ఇళ్ల నుండి బయలుదేరారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటునుంచి వచ్చే భాగమతి రైలును యువకులు గమనించలేదు. వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఇద్దరు యువకులను ఢీకొట్టిందని " అని మిస్టర్ ముకాటి చెప్పారు.


గతంలో..
గత నెలలో ఏపీలోని గుంటూరు జిల్లాలో (Guntur District) ఓ యువకుడి సెల్ఫీ (Selfie) పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సదరు యువకుడు క్రేజీగా గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. అయితే విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. 


Also Read: Guntur: సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు... చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook