Harda Fire Accident: మధ్య ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా ప్రాంతంలో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 60 ఇళ్లు మంటలకు ఆహుతైనట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో సంభవించిన మంటల పేలుడు శబ్దాలు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వరకు విన్పించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అదే విధంగా మంటల ధాటికి ఆ ప్రాంతంలో వెళ్లడానికి ఫైర్ సిబ్బందికి కూడా కష్టంగా మారింది.ముఖ్యంగా ఈఫ్యాక్టరీలో టమాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే భారీగా మంటలు ఎగజిమ్ముతు పేలుడు సంభవించింది. ఘటన జరిగిన చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Read More: AR Rehman: ఏఆర్ రెహమాన్ ప్రయోగం అవసరమా? అయోమయంలో సింగర్స్..


పేలుడులో సంభవించిన మంటలు రోడ్డుపైన వెళ్తున్న ఇద్దరు బైకర్ల మీద పడ్డాయి. దీంతో వారుతీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు స్థానికులతో కలిసి సహయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జిల్లా అధికారులకు ఆదేశించారు. అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలికి చేరుకుని సహయక చర్యలను దగ్గరుండి చూస్తున్నారు. ఘటనలో ఇప్పటిదాక ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook