Raksha Bandhan: రక్షాబంధన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ గిఫ్ట్.. మహిళలకు నెలకు రూ.1250, రూ.450కే గ్యాస్ సిలిండర్
MP Govt Announces 35% Reservation For Women: ఈ ఏడాది చివర్లో ఎన్నికల జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది.
MP Govt Announces 35% Reservation For Women: రక్షాబంధన్ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా కీలక ప్రకటన చేసింది. లాడ్లీ బెహనా పథకం కింద మహిళలకు అందించే ఆర్థిక సహాయాన్ని నెలకు రూ.1,000 నుంచి రూ.1,250కి పెంచింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి 35 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 'సావన్' గుర్తుగా ఆగస్టులో మహిళలకు 450 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
“పవిత్రమైన సావన్ మాసంలో మహిళలకు రూ.450కి వంటగ్యాస్ అందజేస్తాం. తరువాత ఈ విషయంలో శాశ్వత వ్యవస్థను రూపొందిస్తాం. 1.25 కోట్ల మంది మహిళలు రాఖీ (మంగళవారం) ఘనంగా జరుపుకునేందుకు వీలుగా వారి ఖాతాల్లోకి రూ.250 కూడా బదిలీ చేశాం. మిగిలిన రూ.1,000 (లాడ్లీ బెహనా యోజన కింద) సెప్టెంబర్‌లో జమ చేస్తాం” అని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. అక్టోబర్ 1 నుండి 1.25 కోట్ల మంది మహిళలు రూ.1,250 పొందుతారని చెప్పారు. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3 వేలకు పెంచుతామన్నారు. తద్వారా మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రస్తుతం ఉన్న 30 శాతం రిజర్వేషన్లను 35 శాతానికి పెంచామని.. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో 50 శాతానికి పెంచుతామని ఆయన తెలిపారు. లాడ్లీ బెహనా పథకంలో భాగంగా, చిన్న తరహా యూనిట్లను తెరవడానికి పారిశ్రామిక ఎస్టేట్‌లలో మహిళలకు పట్టా భూములు లభిస్తాయని.. మహిళల ఆదాయాన్ని నెలకు కనీసం రూ.10 వేలకి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆక్రమణలను తొలగించిన గ్రామాల్లో మహిళలకు ఉచితంగా భూమి, నగరాల్లో ప్లాట్లు ఇస్తామని సీఎం చౌహాన్ చెప్పారు.
ఈ ఏడాది జూన్ 10న ప్రారంభమైన లాడ్లీ బెహనా యోజన పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3,628.85 కోట్లు ఆర్థిక సాయంగా అందించడం గమనార్హం. 23 నుంచి 60 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కానట్లయితే.. వారి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈ పథకం కింద నెలకు రూ.1,000 పొందుతారు. ఈ మొత్తాన్ని తాజాగా రూ.1250కి పెంచారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం చౌహాన్ వరాల జల్లు కురిపిస్తున్నారు.
Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!
Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook