PM Vishwakarma Yojana Eligibility: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానుంది. సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులను ఆదుకునేందుకు 'పీఎం విశ్వకర్మ యోజన' స్కీమ్‌ను అమలు చేయనుంది. ఈ పథకం అమలుపై చర్చించడానికి ప్రభుత్వం సోమవారం రాష్ట్రాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) నుంచి సీనియర్ అధికారుల సమావేశం నిర్వహించనుంది. సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మూడు మంత్రిత్వ శాఖలు ఎమ్ఎస్‌ఎమ్‌ఈ, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్ విభాగాలు అమలు చేస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల మంది లబ్ధిదారులను నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ అధికారి తెలిపారు.
“నైపుణ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 28న సమావేశానికి పిలిచింది. దీనిలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, SLBC ప్రతినిధులను పాల్గొంటారు. ఈ సమావేశంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం అమలుకు సంబంధించిన రోడ్‌మ్యాప్, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియపై చర్చించనున్నారు" అని ఆయన తెలిపారు. ఈ పథకం కింద నైపుణ్యం కలిగిన కార్మికులకు వారి నైపుణ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి 4-5 రోజుల పాటు శిక్షణ అందజేస్తారు. అనంతరం వారికి లోన్‌కు అర్హులు అవుతారు.
ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలపై ఉంటుంది. ఇక్కడ గ్రామ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కార్పొరేషన్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఎన్‌రోల్‌మెంట్‌పై MSME మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారి తెలిపారు. ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల కాలానికి (2023-24 నుంచి 2027-28) రూ.13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ పీఎం విశ్వకర్మకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 16న ఆమోదం తెలిపింది.
పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తిదారులకు మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.2 లక్షలు లోన్ అందజేస్తారు. వడ్డీ రేటు కూడా 5 శాతం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం 18 సాంప్రదాయ వ్యాపారాలకు లోన్ అందజేయనున్నారు. వీటిలో వడ్రంగి, పడవ తయారీదారు, కవచం, కమ్మరి, సుత్తి, పనిముట్టు కిట్ తయారీదారు, తాళాలు తయారీ, స్వర్ణకారుడు, కుమ్మరి, శిల్పి, రాళ్లను పగలగొట్టేవారు, చెప్పులు కుట్టేవారు/ షూమిత్/పాదరక్షల కళాకారుడు, తాపీ మేస్త్రీ, బుట్ట/చాప/చీపురు మేకర్/కాయిర్ నేత, బొమ్మలు తయారీ కళాకారులు ఉన్నారు. బార్బర్, దండ మేకర్, రజకులు, టైలర్, ఫిషింగ్ నెట్ మేకర్స్ కూడా ఈ పథకానికి అర్హులు.
Also Read: Retirement Age: ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు..? కేంద్రం ముందుకు ఫైల్
Also Read: Pakistan ODI Rank: వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ టీమ్‌గా పాకిస్థాన్.. భారత్ ర్యాంక్ ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook