MP Government: మధ్యప్రదేశ్‌ లోని మోహన్ యాదవ్  ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మన దేశంలో క్లీన్‌ సిటీ గా వున్న, ఇండోర్‌లో బిచ్చగాళ్లకు  బిచ్చం కానీ ధర్మం వేస్తే ఇక నుంచి కేసు పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో అత్యంత  క్లీన్‌  సిటీగా ఉన్న ఇండోర్ ను  బిచ్చగాళ్ల రహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్లపై యాచకులు లేకుండా కఠిన చర్యలకు మధ్యప్రదేశ్ ​ప్రభుత్వం దిగుతోంది. సిటీలో భిక్షాటనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపింది. కొత్త రూల్‌  జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సిటీలో ఎవరైనా యాచించినా.. యాచకులకు బిచ్చం వేసినా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.


ఈ మేరకు ఇండోర్‌ సిటీ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ పట్టణాన్ని యాచకుల రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అతి త్వరలో  ఈ ప్రాజెక్ట్​ను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇండోర్, లక్నో, ముంబై,హైదరాబాద్, నాగ్‌‌పూర్,పాట్నా,అహ్మదాబాద్ వంటి 10 నగరాల్లో అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.