Lalji Tandon Passes Away | మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అశుతోష్ టాండన్ వెల్లడించారు. తన తండ్రి ఇకలేరంటూ అశుతోష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి లాల్జీ టాండన్ మరణవార్తను తెలిపారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో యూపీ, లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లాల్జీ టాండన్‌ను ఇటీవల కుటుంబసభ్యులు చేర్పించారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. Covid19: బ్రెజిల్‌లో కరోనా వైరస్ బీభత్సం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో లాల్జీ టాండన్ తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మృతి పట్ల నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాజకీయ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. లాల్జీ టాండన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు


లాల్జీ టాండన్ తీవ్ర అస్వస్థతతో లక్నోలోని ఆసుపత్రిలో చేరిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన మరణంతో మరికొన్ని రోజులు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఆమె అదనంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..