Covid19: బ్రెజిల్‌లో కరోనా వైరస్ బీభత్సం

CoronaVirus Death Toll In Brazil | ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అనంతరం కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశం బ్రెజిల్. ఈ విషయంలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో రికవరీ రేటు పరవాలేదనిపించినా, కరోనా మరణాలు ఆందోళన పెంచుతున్నాయి.

Last Updated : Jul 21, 2020, 07:37 AM IST
Covid19: బ్రెజిల్‌లో కరోనా వైరస్ బీభత్సం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ ఉంది. ఈ మూడు దేశాలలో రోజురోజుకూ భారీ సంఖ్యలో కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ 80వేల కరోనా మరణాల (CoronaVirus Deaths In Brazil) మార్క్ చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

బ్రెజిల్‌లో తాజాగా 21,749 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కోవిడ్19 కేసుల సంఖ్య 21,21,645కి చేరుకుంది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో (జులై 20న) 718 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ బ్రెజిల్‌లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య (COVID19 Death Toll in Brazil) 80,251కి చేరింది.  ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటిన్నరగా ఉంది. 6,12,585 కరోనా మరణాలు సంభవించాయి. అమెరికాలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 62 వేల కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ మొత్తం కేసులు సంఖ్య 40 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా 503 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,43,792కి చేరింది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News