Madhya Pradesh HighCourt Sentational Judgement On Breakup After A Live In Relationship: ప్రస్తుతం యువత ఆలోచనధోరణి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లుచేసుకొవడానికి ఆసక్తి చూపించేవారు. ప్రతిదాంట్లో పెద్దల మాటలు వినేవారు. కానీ నేటి యువత దీనికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా.. పెళ్లికాకుండానే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉంటున్నారు. కొందరు యువత ఇంట్లో వాళ్లకు తెలియనీయకుండా తమకునచ్చిన వారితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. ఇలా కొన్నేళ్లపాటు కలిసి జర్నీ చేస్తున్నారు. ఆ తర్వాత తమ అభిరుచులు, ఆలోచనలు కలిస్తే ముందుకు వెళ్తున్నారు. లేకుంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


సాధారణంగా పెళ్లి తర్వాత కొందరు భార్యభర్తల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఆలోనల్లో విభేదాలు ఉంటాయి. కొందరు వీటిని నాలుగు గొడల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మరికొందరు అందరి మధ్యపంచాయతీలు పెట్టుకుని,కోర్టులకు కూడా వెళ్లడానికి వెనుకాడవరు. కొన్ని చోట్ల మహిళలు, భర్తలను వేధిస్తుంటారు. మరికొన్ని చోట్లలో.. మగాళ్లు కూడా తమ భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.దీంతో ఇలాంటి ఘటనలు కోర్టులవరకు వెళ్తుంటాయి. పెళ్లైన మహిళతనకు భర్త శాలరీ నుంచి ప్రతినెల కొంత భరణం రూపంలో ఇవ్వాలని కూడా కోర్టులో పిటిషలు వేస్తుంటారు. కోర్టులు కూడా వీటిని మహిళలకు ఫెవర్ గా ఆర్డర్ లు ఇస్తుంటాయి. 


తాజాగా, మధ్య ప్రదేశ్ కోర్టు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళకు కూడా భరణం ఇవ్వాల్సిందే నంటూ తీర్పు వెలువరించింది. భోపాల్ కు చెందిన ఇద్దరు కొన్నేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆతర్వాత సదరు వ్యక్తి.. తనకు మహిళనచ్చలేదని వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కొన్నేళ్లపాటు సహాజీవనం చేశాక ఇప్పుడు ఇలా చేశాడంటూ వాపోయింది. దీన్ని విచారించిన ట్రయల్ కోర్టు, సదరు మహిళకు, ప్రతినెల 1500 రూపాయాలు భరణంగా చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై అతగాడు మధ్య ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు.


ఆతర్వాత దీన్ని ధర్మాసం దీనిపై విచారణ చేపట్టింది. ఇద్దరు వ్యక్తులు చట్టబధ్దంగా పెళ్లి చేసుకోకున్న కూడా.. ఇరువురీ అంగీకారంతో కొన్నేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్ లిప్ లో ఉండి విడిపోయినా కూడా ఆ మహిళలకు భరణం ఇవ్వాల్సిందేనంటూ తీర్పును వెలువరించింది. ట్రయల్ కోర్టును ఇచ్చిన తీర్పుసరైనదేనంటూ కోర్టు వ్యాఖ్యానించింది.


Read More: Chocolate Banana Dosa: వావ్.. యమ్మీ యమ్మీ.. చాక్లెట్ బనానా దోశ.. వైరల్ గా మారిన వీడియో..


అదే విధంగా..దంపతుల మధ్య సహజీవనం చేసినట్లు రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు ఉదహరిస్తూ, స్త్రీ, పురుషులు భార్యాభర్తలుగా జీవిస్తున్నారని నిర్ధారించింది. అదనంగా, సంబంధంలో పిల్లల పుట్టుకను పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం మహిళకు భరణం పొందే అర్హతను ధృవీకరించింది. కాగా, ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పును కొందరు స్వాగతిస్తుండగా..మరికొందరు ఇలాంటి పోకడలు దేనీవైపు దారితీస్తాయో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook