Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు మొదట ప్రచారం జరిగినప్పటికీ... దీని వెనకాల ఓ యువకుడు ఉన్నట్లు తేలింది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో సంజయ్ అలియాస్ శుభమ్ దీక్షిత్ (27) అనే యువకుడు ఆ భవనానికి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్ని ప్రమాద ఘటనపై ఏఎన్ఐతో మాట్లాడిన స్థానిక పోలీస్ కమిషనర్ మిశ్రా పలు విషయాలు వెల్లడించారు. 'ఈ ఘటనకు సంబంధించి 50కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. ఒక ఫుటేజీలో సంజయ్ అనే యువకుడిని గుర్తించాం. అగ్ని ప్రమాద ఘటనకు కాసేపటి ముందు అతను ఆ బిల్డింగ్‌లోకి వెళ్లినట్లు గుర్తించాం. పోలీస్ టీమ్ దర్యాప్తులో అతనే బిల్డింగ్‌కి నిప్పంటించినట్లు వెల్లడైంది.' అని మిశ్రా తెలిపారు.


మొదట అతను పార్కింగ్ ప్రదేశంలోని ఓ స్కూటర్‌కి నిప్పంటించాడని... కాసేపటికే ఆ మంటలు భవనమంతా వ్యాపించాయని మిశ్రా వెల్లడించారు. నిందితుడు సంజయ్ గతంలో ఇదే భవనంలో నివాసం ఉన్నాడని... ఆర్నెళ్ల క్రితమే ఫ్లాట్ ఖాళీ చేశాడని చెప్పారు. ఇదే భవనంలో నివసిస్తున్న ఓ యువతిని అతను ప్రేమించాడని... కానీ అతని ప్రేమను ఆమె నిరాకరించిందన్నారు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుండటంతో... ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె నివసిస్తున్న బిల్డింగ్‌కి నిప్పంటించాడని అన్నారు.


అదృష్టవశాత్తు అగ్ని ప్రమాద ఘటనలో ఆ యువతి ప్రాణాలతో బయటపడినట్లు మిశ్రా తెలిపారు. ఆమె నుంచి కూడా వివరాలు సేకరించామని... నిందితుడిపై సెక్షన్ 302, 436 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Also Read: Happy Mothers Day 2022: నేడు  మదర్స్ డే... మాతృమూర్తులకు 'గూగుల్ డూడుల్' స్పెషల్ విషెస్...


Also Read: Mothers Day 2022 : రేపు మదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook