కరోనా భయం: నాలుక కోసేసుకున్నాడు!
ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు (Youth cuts his tongue) చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుత సమస్య కరోనా వైరస్. ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో గుజరాత్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య
గుజరాత్, సూరత్‌లోని సుయిగంలో ఓ 20 ఏళ్ల యువకుడు రవీందర్ శర్మ తన నాలుక కోసుకున్నాడు. అతడి స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాకు చెందిన అతడు గత 15 నెలలుగా నరాబెట్‌లోని భవానీ మాత ఆలయంలో పని చేస్తున్నాడు. తనకు కలలో దేవత ప్రత్యక్షమై నాలుక కోసుకుంటే తన స్వగ్రామంలో కరోనా పీడ విరగడ అవుతుందని చెప్పడంతో ఈ పని చేశానని రవీందర్ చెబుతున్నాడు. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
ఆలయం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న రవీందర్‌ను గమనించిన బీఎస్ఎఫ్ బలగాలు సుయిగమ్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. ఇలాంటి మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదమని బీఎస్ఎఫ్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. శుభ్రంగా చేతులు కడుక్కోవడ, సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తే కరోనా సమస్య తీరుతుందని సూచించారు. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!
కాగా, మధ్యప్రదేశ్‌లో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం 127 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో 200కు పైగా కరోనా మరణాల తర్వాత 69 మరణాలతో మధ్యప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు నాలుక కోసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos