A Women LIVE Sucide Attmept Video: మానవత్వం (Humanity) అంటే.... వాట్సప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేయటం, దేవుడి ఫోటో పెట్టి 10 మందికి ఫార్వర్డ్ చేయటం కాదు. ఆకలి తీర్చటం, తోటి మనుషులను ప్రేమించటం, ప్రాణాలు కాపాడటం.. అవును ఇటీవల మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఆటో డ్రైవర్ ఒక యువతి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోబోతుంటే ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కాసేపట్లో రైలు రాబోతున్న సిగ్నల్ రాగానే గేటు పడింది. గేటు పడ్డ తరువాత ఆటోలు, కార్లు, బైక్ మరియు ఇతర వాహనాలు గేటుకు ముందుగా ఆగి రైలు వెళ్ళటం కోసం ఎదురుచూస్తున్నారు. ఆటో పక్కనే నిలబడ్డ ఉన్న ఒక యువతి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని గేటుకు కొంచెం దూరంలో నిలబడింది. 


Also Read: Bank Holidays October 2021: వచ్చే నెలలో 21 రోజులు పాటు బ్యాంకులకు సెలవులు...బి అలర్ట్


రైలు వస్తున్న శబ్దం రాగానే ఆ యువతి గేటు దాటి వెళ్లి రైలు పట్టాలపై నిలబడింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ త్వరగా వెళ్లి ఆ అమ్మాయిని పట్టాల నుండి లాక్కొని రావటానికి ప్రయత్నించాడు. ఆ యువతి వినపించుకోకుండా "నేను చనిపోవాలి అనుకుంటున్నా.. వదిలేయండి అని అరిచింది". ఆటో డ్రైవర్ ఆ యువతి మాటలను ఏ మాత్రం వినకుండా పక్కకు లాక్కొంచాడు. 




అదృష్టవశాత్తు వారిద్దరు పక్కకి వచ్చిన తరువాత రైలు వెళ్ళిపోయింది. "ఎందుకు నన్ను కాపాడారు.. నేను చనిపోవాలి అనుకుంటున్నాని చెప్పటంతో.." అక్కడున్న వారందరు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. ఉద్యోగం రాకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. యువతి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ మొహ్సిన్‌గా గుర్తించారు. 


Also Read: Pushpa movie : పుష్పరాజ్‌ ప్రేయసి వచ్చేసింది..రష్మిక ఫస్ట్‏లుక్ అదిరిందిగా..


ప్రముఖ న్యూస్ ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది,  ఈ వీడియోపై అంకిత శర్మ ఐపీఎస్‌ (Ankita Sharma IPS) తో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. యువతి ఎవరో తెలియకున్నా ఆ పరిస్థితిలో ఉన్న యువతిని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కాపాడిన ఆటో డ్రైవర్ పై ప్రశంశల జల్లు కురుస్తుంది. 


ఆటో డ్రైవర్ సాహసానికి అందరు మెచ్చుకుంటూ, అన్నిటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు.. యువత ఎపుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రముఖులు సూచిస్తున్నారు. ఎవరైన వారి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నపుడు మనకెందుకులే అని పట్టించుకోకుండా దైర్యంగా ముందుకు వచ్చిన ఈ ఆటో డ్రైవర్ వంటి వాళ్లు ఉండటంతో మానవత్వం ఇంకా ఏ మూలనో ఉందన్న భావన అందరిలో కలుగుతుంది. 


Also Read: Chinese troops: 55 గుర్రాలపై ఉత్తరాఖండ్‌లోకి దూసుకొచ్చిన చైనా సైనికులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook